Begin typing your search above and press return to search.

YRF కోసం SRK అట్లీని బ‌లి పెడ‌తాడ‌నుకోలేదు!

By:  Tupaki Desk   |   13 Sep 2020 11:50 AM GMT
YRF కోసం SRK అట్లీని బ‌లి పెడ‌తాడ‌నుకోలేదు!
X
జీరో డిజాస్టార్ అయ్యాక కింగ్ ఖాన్ పూర్తిగా హైడ్ లోకి వెళ్లిపోయాడు. అయితే పులి ఒక్క అడుగు వెన‌క్కి వేస్తే వంద అడుగులు ముందుకురుకుతుంది! అన్న చందంగా ఏదో ఒక‌టి చేయాల‌న్న క‌సితో ర‌గిలిపోతున్నాడు ఖాన్ జీ. అందుకే చాలా కాలంగా ఏ ప్రాజెక్టుకు క‌మిట‌వ్వ‌లేదు. ఆచితూచి క‌థ‌ల్ని ద‌ర్శ‌కుల్ని జ‌ల్లెడ ప‌డుతున్నాడు. ఇప్ప‌టికీ షారూఖ్ ఖాన్ తదుపరి ప్రాజెక్ట్ గురించి చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ ఏదీ క‌న్ఫామ్ కావ‌డం లేదు.

ఇంత‌కుముందు త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీకి షారూక్ క‌మిటైపోయాడని చాలా బ‌ల‌మైన ప్ర‌చార‌మే సాగింది. కానీ ఇంత‌లోనే ఫేట్ మారిందంటూ తాజాగా మ‌రో కొత్త క‌బురు అందింది. ఎస్.ఆర్.కే త‌న ఫేవ‌రెట్ య‌ష్ రాజ్ ఫిలింస్ కి క‌మిటైపోయాడ‌న్న‌ది తాజా నివేదిక‌. అయితే ఇది అట్లీ సినిమా త‌ర్వాత‌నా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

సూపర్ స్టార్ షారూక్- యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించ‌నున్న `పఠాన్`కి ఓకే చెప్పార‌‌ని..ఈ చిత్రంలో జాన్ అబ్రహం సమాంతర లీడ్ గా న‌టిస్తాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. 2021 జనవరిలో షారుఖ్ ఖాన్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. సత్యమేవ్ జయతే తదుపరి విడత పూర్తయిన తరువాత జాన్ అబ్రహం మార్చి నుంచి సెట్స్ లోకి జాయిన్ అవుతారు.

షారూఖ్‌ ఖాన్ కథానాయకుడిగా నటించ‌నున్న ఈ చిత్ంర‌లో జాన్ విల‌న్ గా న‌టిస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. న్యూయార్క్ (2009) తరువాత యష్ రాజ్ బ్యానర్ లో మూవీలోనే అత‌డు విలన్ పాత్రకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. వాస్తవానికి ధూమ్ (2004) తో బిగ్ విలన్ లీగ్ ‌లో జాన్ అబ్రహాంకు లైఫ్ నిచ్చింది యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ‌నే.

పఠాన్ కాకుండా షారుఖ్ ఖాన్ కెరీర్ ప‌రిశీలిస్తే.. ఇటీవల బాబీ డియోల్ నటించిన `క్లాస్ ఆఫ్ 83` చిత్రాన్ని నిర్మించారు. ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ తదుపరి రాజ్ & డికె తదుపరి వెంచర్లో కనిపించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. ఆ ఇద్ద‌రూ షారూక్ ని స్క్రిప్టుతో ప‌డ‌గొట్టామ‌ని ఇదివ‌ర‌కూ తెలిపారు. అలాగే ఫరా ఖాన్- ఫర్హాన్ అక్త‌ర్- అట్లీ - ఆదిత్య చోప్రాలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రణబీర్ కపూర్- అలియా భట్ - అమితాబ్ బచ్చన్ తారాగ‌ణంగా ఆర్ మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన `రాకెట్ట్రీ: ది నంబి ఎఫెక్ట్` లో అలానే అయాన్ ముఖర్జీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం `బ్రహ్మాస్త్ర`లో SRK కి ప్రత్యేక పాత్ర ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఇక మాధ‌వ‌న్ సినిమాలో షారూక్ జ‌ర్న‌లిస్టుగా న‌టించ‌నున్నార‌ట‌. బ్రహ్మాస్త్ర‌లో SRK ఒక అతిధి పాత్రను చేస్తున్నారు. అలాగే జాన్ అబ్రహం తదుపరి సత్యమేవ్ జయతే చిత్రంలో కనిపించనున్నారు. అతను `ముంబై సాగా`.. ఎటాక్ .. 2 విల్లియన్ చిత్రాల్లోనూ న‌టిస్తున్నాడు.