మిత్రుడు చిరంజీవి కోసం.. మోహన్ బాబు వ్రాయునది

Thu Jun 17 2021 15:06:34 GMT+0530 (IST)

Written by Mohan Babu for friend Chiranjeevi

చిరంజీవి - మోహన్ బాబు గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. అప్పటి వరకు మంచి మిత్రుల్లా కనిపించిన వారు.. ఉన్నట్టుండి బద్ద విరోధుల్లా మాట్లాడుకుంటారు. ఇక వీరి మధ్య శతృత్వం శాశ్వతం అని అనుకునే వేళ.. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని అవాక్కయ్యేలా చేస్తారు. ఇందుకు గతంలో కావాల్సినన్ని ఉదాహరణలు ఉన్నాయన్న సంతి అందరికీ తెలిసిందే.అయితే.. కొంత కాలంగా వీరి మధ్య స్నేహం మాత్రమే పరిమళిస్తోంది. ఒకరి ఫంక్షన్లకు మరొకరు హాజరు కావడం.. ఒకరి గురించి మరొకరు పొగుడుకోవడం కూడా నడుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అర్థంకాని వాళ్లకు.. తమది ‘టామ్ అండ్ జెర్రీ’ రిలేషన్ అని పలు మార్లు చెప్పారు మెగాస్టార్.

కాగా.. ప్రస్తుతం మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత కలెక్షన్ కింగ్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. దీంతో.. స్పెషల్ గా లాంఛ్ చేయడానికి చూస్తున్నారు మోహన్ బాబు. దీనికోసం చిరకాల మిత్రుడు చిరంజీవి సహకారం కూడా తీసుకున్నారు.

‘సన్నాఫ్ ఇండియా’ టీజర్ కు వాయిస్ ఓవర్ అందించారు చిరంజీవి. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. చిరు వాయిస్ ను కేవలం టీజర్ కు మాత్రమే పరిమితం చేయకుండా.. సినిమాలోనూ కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలన్నింటినీ మెగాస్టార్ తన వాయిస్ తో పరిచయం చేస్తారని సమాచారం.

అంతేకాదు.. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారట మోహన్ బాబు. ఈ కార్యక్రమానికి మిత్రుడు చిరంజీవికి ఆహ్వానం పంపబోతున్నారట. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఈ కార్యక్రమం కొనసాగించడానికి ప్లాన్ చేస్తున్నారట మోహన్ బాబు. ఆ విధంగా ఇద్దరు మిత్రులు కలిసి మధుర స్మృతులు మరోసారి పంచుకోబోతున్నారట. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.