రైటర్ కమ్ ప్రొడ్యూసర్ ఇమేజ్ బాగా తగ్గిపోయిందా...?

Sun Sep 20 2020 05:00:05 GMT+0530 (IST)

Writer cum producer image has been greatly reduced ...?

టాలీవుడ్ లో చాలా మంది రచయితలు ప్రొడ్యూసర్స్ గా మారి సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ఓ రైటర్.. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తున్నాడు. నిర్మాతగా పలు హిట్స్ కూడా అందుకున్నాడు. అయితే ఇన్నాళ్లు రచయితగా ఉన్న అతను పేరున్న నటీనటుల డేట్స్ సంపాదించడం వెనుక పెద్ద కథే ఉంటుందని టాక్ ఉంది. అతను ఏ హీరోనైనా హీరోయిన్ నైనా కలవాలి అనుకుంటే ముందుగానే వారి మీద రెక్కీ చేసి.. వారి డైలీ హ్యబిట్స్ తాను కూడా అలవాటు చేసుకొని.. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసుకుని అక్కడ మాటు వేసి ఏదో రకంగా డేట్స్ కొట్టేస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ డేట్స్ సంపాదించి మూవీ తీసాడని అందరూ చెప్పుకుంటుంటారు.అయితే భారీ క్యాస్టింగ్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా కోసం టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలను కలుపుకొని భారీగానే ఖర్చు పెట్టించాడట. ఆ సినిమాకు కథను అందించడంతో పాటు నటీనటులను ఎంపిక కూడా తనే చూసుకున్నాడు. ఎప్పుడో కంప్లీట్ అయిన ఈ సినిమాని ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధం చేసారు. అయితే ఈ సినిమా డీల్ విషయంలో సదరు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ తక్కువ ప్రాఫిట్ వచ్చే విధంగా వ్యవహరించాడట. దీంతో సినిమాకి భారీ పెట్టుబడి పెట్టించి.. ఇప్పుడేమో తక్కువకే డీల్ క్లోజ్ చేపించాడని పార్టనర్ ప్రొడ్యూసర్స్ ఆలోచనలో పడ్డారట. ఇదంతా ఫిలిం సర్కిల్స్ లోకి వెళ్లిపోవడంతో ఇండస్ట్రీలో ఆ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ ఇమేజ్ బాగా తగ్గిందని.. అతన్ని అందరూ దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.