Begin typing your search above and press return to search.

ఆ హీరో హీరోయిన్స్ కలిసి నటించకుండా ఉంటే బాగుండేది...!

By:  Tupaki Desk   |   4 July 2020 8:15 AM GMT
ఆ హీరో హీరోయిన్స్ కలిసి నటించకుండా ఉంటే బాగుండేది...!
X
ఒక సినిమా సూపర్ హిట్ అవడానికి కారణంగా స్టోరీతో పాటు స్క్రీన్ పై హీరో హీరోయిన్ల కాంబినేషన్ కూడా కుదరాలి. హీరోకు సరైన జోడి అనిపించే హీరోయిన్ ని మేకర్స్ సెలెక్ట్ చేసుకుకోవాలి. ఈ విధంగా జోడీ కుదిరి సిల్వర్ స్క్రీన్ పై హిట్ పెయిర్ గా నిలిచిపోయిన హీరో హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అయితే కొన్ని సార్లు దర్శకనిర్మాతలు ఎన్నో అలోచించి హీరో హీరోయిన్లను ఎంపిక చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై వారిని చూడటానికి ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. సినిమా హిట్ అయినప్పటికీ వీరిద్దరూ కలిసి మళ్ళీ యాక్ట్ చేయకపోతే బాగుండు అని కూడా అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించిన హీరో హీరోయిన్ల కాంబినేషన్స్ ఒకసారి చూద్దాం.

సీనియర్ హీరోలైన చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ ల సరసన యంగ్ బ్యూటీస్ నటించిన సినిమాలు చాలా వరకు వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. ఒకప్పుడు వెంకటేష్ - జెనీలియా కలిసి 'సుభాష్ చంద్రబోస్' సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి జోడీపై అప్పట్లో కామెంట్స్ బాగానే వచ్చాయి. ఇక చిరంజీవి 'స్టాలిన్' సినిమాలో త్రిష చాలా యంగ్ గా కనిపించడంతో ప్రేక్షకులు వీరి జంటను చూడటానికి ఇబ్బంది పడ్డారు. ఇక బాలయ్య 'అల్లరి పిడుగు' సినిమాలో పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ అసలు సెట్ అవలేదని అనుకున్నారు. మహేష్ బాబు సినిమాలకి మొదటి నుండి హీరోయిన్స్ ని సెలెక్ట్ చేయడం సమస్యగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే మహేష్ పక్కన ఏ హీరోయిన్ ని పెట్టిన అతని డామినేషన్ ఎక్కువ ఉంటుంది. దీంతో హీరోకి అక్క లా కనిపిస్తుంది అనే కామెంట్స్ వినిపించేవి. ఈ క్రమంలో 'ఖలేజా' సినిమాలో అనుష్క మహేష్ కంటే పెద్దదానిలా కనిపించిందని అన్నారు. అలానే 'నిజం' సినిమాలో మహేష్ - రక్షిత జోడీ ఆడియన్స్ ని బాగా ఇబ్బంది పెట్టింది.

రజినీకాంత్ వయసు రీత్యా హీరోయిన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. 'లింగా' సినిమాలో రజినీకి జోడీగా నటించిన అనుష్క - సోనాక్షి సిన్హా కాంబినేషన్ కుదరలేదు. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాలో కీర్తి సురేష్ - అను ఎమ్మానుయేల్ కాకుండా వేరే వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో భానుశ్రీ మెహ్రా ని హీరోయిన్ గా ఎలా సెలెక్ట్ చేసారో అని అందరూ ఆలోచించారు. 'తుఫాన్' సినిమాలో రామ్ చరణ్ - ప్రియాంకాచోప్రా జోడీని స్క్రీన్ పైన ఆడియన్స్ చూడలేకపోయారు. రామ్ పోతినేని 'గణేష్' సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ సెట్ కాలేదు. ఈ విధంగా సిల్వర్ స్క్రీన్ పైన డిజప్పాయింట్ చేసిన జోడీలు చాలానే ఉన్నాయి.