ఆకాశంలో అద్భుతం.. క్రిష్ షేర్ చేసిన వీడియో..!

Wed Dec 07 2022 11:27:42 GMT+0530 (India Standard Time)

Wonderful in the sky.. The video shared by Krish!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక షూటింగ్ టైం లో ఆకాశంలో ఒక అద్భుతాన్ని చూశాడు డైరెక్టర్ క్రిష్. అది తన మొబైల్ లో కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆకాశంలో ఒక అద్భుతమైన వెలుగు అది త్రిభుజాకారంలో కనిపిస్తుంది. మామూలుగా కనిపించకపోవడంతో సెల్ జూమ్ చేసి మరీ చూస్తేనే అది కనబడుతుంది. ఇంతకీ అసలు ఏంటి అన్నది అర్ధం కావట్లేదు. మీకెవరికైనా తెలుసా అని అదేంటో చెప్పండి అని తన ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశాడు.

ఆకాశంలో అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. వాటికి కొన్నిసార్లు సమాధానాలు దొరుకుతాయి కానీ కొన్నిసార్లు మాత్రం ఆన్సర్స్ కనిపెట్టలేరు. అసలు ఆకాశంలో అంత ఎత్తున ఆ వెలుగు దేనిదై ఉంటుందా అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. క్రిష్ షేర్ చేసిన ఈ వీడియో నిమిషాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియో ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే డైరక్టర్ క్రిష్ ఒక్కరే ఇది గమనించారా లేక మరెవరైనా సరే ఈ వెలుగుని గుర్తించారా అన్నది తెలియాల్సి ఉంది.

క్రిష్ షేర్ చేయడంతో ఈ వీడియోపై స్పెషల్ డిస్కషన్స్ పెట్టేస్తున్నారు. వీరమల్లు సెట్ లో వింత అద్భుతం అంటూ ఇప్పటికే వీడియో న్యూస్ వైరల్ గా మారింది. హరి హర వీరమల్లు మూవీ విషయానికి వస్తే క్రిష్ తన టాలెంట్ మొత్తం ఉపయోగించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సినిమాలో నిధి అగర్వాల్ జాక్వెలిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

పవన్ కెరీర్ లో వీరమల్లు మూవీ ప్రత్యేకమైన సినిమాగా వస్తుంది. సినిమాలో పవర్ స్టార్ లుక్ క్రేజీగ ఉంది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంగీతం పరంగా కూడా సెన్సేషనల్ కానుందని అంటున్నారు. కొండపొలంతో అంచనాలను అందుకోలేని క్రిష్ వీరమల్లుతో విజయ ఢంఖా మోగించాలని చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.