ఆ ఇద్దరు లేకపోతే స్టార్ హీరోల పరిస్థితేంటీ?

Wed Dec 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Without Pooja Hegde and Rashmika Tollywood Star Heros Condition

తెలుగులో స్టార్ హీరోలకు హీరోయిన్ ల కొరత వున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతీ స్టార్ హీరోకున్నఏకైక ఆప్షన్ పూజా హెగ్డే. తన తరువాత నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంటున్నారు. 'ఒక లైలా కోసం' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఆల్ మోస్ట్ ఆల్ టాప్ స్టార్స్ తో నటించేసింది. 'ముకుంద'లో వరుణ్ తేజ్ తో.. దువ్వాడ జగన్నాథమ్' అల వైకుంఠపురములో' చిత్రాల్లో అల్లు అర్జున్ తో.. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత'లో.. మెరిసింది.సూపర్ స్టార్ మహేష్ తో 'మహర్షి' రామ్ చరణ్ తో 'ఆచార్య' ప్రభాస్ తో 'రాధేశ్యామ్' అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రస్తుతం మహేష్ 28 లోనూ నటిస్తోంది. అంటే ఆల్ మోస్ట్ టాలీవుడ్ క్రేజీ హీరోలని కవర్ చేసేసిందన్నమాట. ఒక్క పవన్ తో కలిసి చేస్తే ఆల్ స్టార్ హీరోస్ ఫినిష్ అయినట్టే. 'భవదీయుడు భగత్ సింగ్' కోసం పూజా హెగ్డేనే అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఇప్పట్లో వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక పూజా హెగ్డే తరువాత స్టార్ హీరోలు ఎక్కువగా కోరుకుంటున్న హీరోయిన్ రష్మిక మందన్న.. నాగశౌర్య విజయ్ దేవరకొండ వంటి హీరోలతో కెరీర్ ప్రారంభించిన రష్మిక ఆ తరువాత మహేష్ తో 'సరిలేరు నీకెవ్వరు' అల్లు అర్జున్ తో 'పుష్ప' వంటి సినిమాల్లో నటించింది.

త్వరలో బన్నీ 'పుష్ప 2'లో  చేయబోతోంది. ఈ ఇద్దరు తప్ప తెలుగులో టాప్ స్టార్స్ కి మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఒక వేళ పూజా హెగ్డే లేకపోతే తనకు బదులుగా హీరోయిన్ ఎవరున్నారంటే సమాధానం రావడం లేదు.

ఇప్పటికే స్టార్ హీరోలందరిని ముట్టబొమ్మ చుట్టేయడంతో ప్రొబ్యూసర్స్ ఇతర ఆప్షన్ ల కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా 'సీతారమం' మూవీతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మృణాల్ ఠాకూర్ ఆప్షన్ గా నిలుస్తోంది. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం తనని పెద్దగా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడటం లేదు. తనని కాకుండా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ లని ఫైనల్ చేసుకోవాలని అనుకున్నా దీపిక అలియా భట్ లాంటి హీరోయిన్ లు సెలక్టీవ్ ప్రాజెక్ట్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి పూజా హెగ్డే తరువాత ఆప్షన్ లేకుండా పోతోంది. తన స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్ కోసం ఇప్పడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అన్వేషిస్తున్నారట. ఇదిలా వుంటే పూజా హెగ్డే రష్మిక లేకుండా మన హీరోల పరిస్థితి ఏంటీ? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.