సురేందర్ రెడ్డి తర్వాత అఖిల్ ఎవరితో?

Mon Apr 19 2021 07:00:01 GMT+0530 (IST)

With whom is Akhil after Surender Reddy

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జీఏ2 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే చిత్రమిదని ఇంతకుముందు వెల్లడించారు. ఏజెంట్ అనే టైటిల్ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరి తో పని చేస్తారు? అన్నదానికి తాజాగా సమాధానం లభించింది.ఇండస్ట్రీలో వరుసగా రికార్డ్ బ్రేకింగ్ సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్న మైత్రి సంస్థకు అఖిల్ కాల్షీట్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్.ఎక్స్ 100 అజయ్ భూపతి వినిపించిన కథ ఓకే అయ్యిందట. అఖిల్ ఈ చిత్రంలో నటిస్తారని తిరుపతి నేపథ్యంలో పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అఖిల్ ప్రస్తుతం రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో ఏజెంట్ పై దృష్టి సారించారు. అజయ్ మహాసముద్రం చిత్రంతో బిజీ. అలాగే మైత్రి సంస్థ వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తోంది. బన్నితో `పుష్ప` -మహేష్ తో `సర్కార్ వారి పాట` తర్వాత ఎన్టీఆర్ తోనూ మైత్రి సంస్థ సినిమాలు చేయనుంది.