Begin typing your search above and press return to search.

ఏ ధైర్యంతో మ‌న స్టార్లు సెట్స్ కెళుతున్నారు?

By:  Tupaki Desk   |   25 Jan 2022 5:26 AM GMT
ఏ ధైర్యంతో మ‌న స్టార్లు సెట్స్ కెళుతున్నారు?
X
చూస్తుండ‌గానే అంతా మారిపోతోంది. రెండేళ్ల క్రితం క‌రోనా మ‌హ‌మ్మారీ దేశంలో ప్ర‌వేశించిన‌ప్పటి అల్ల‌క‌ల్లోలం ఇంకా క‌ళ్ల ముందే మెదులుతోంది. అదో పీడ క‌ల‌లాంటిది. ప్ర‌జ‌లు రోడ్ల బాట ప‌ట్టి తిండి తిప్పలు లేక అల‌మటించారు. మొద‌టి వేవ్ లో ల‌క్ష‌ల్లో మ‌ర‌ణించారు. రెండో వేవ్ లో అంత‌కుమించి శ‌వాల గుట్ట‌లు క‌నిపించాయి.

ఆ భ‌యం ఇంకా క‌ళ్ల ముందే మెదులుతుండ‌గా మూడో వేవ్ మొద‌లైంది. భార‌తదేశంలో రోజూ ల‌క్ష‌ల్లో క‌రోనా కేసులు న‌మోదవ్వ‌డం భ‌య‌పెట్టింది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఈసారి దాని ప్ర‌భావం అంత‌గా లేదు. మ‌ర‌ణ‌భ‌యం లేదు. ప్ర‌తి ఇంట్లో ఒక‌రిద్ద‌రు ద‌గ్గు జ్వ‌రం త‌లనొప్పుల భారిన ప‌డ‌డం కామ‌న్ గా మారింది. అంటే క‌రోనా కామ‌న్ జ్వ‌రంగా కొద్దిరోజులు ఉండి ట్రీట్ మెంట్ తో వెళ్లిపోతుంద‌న్న‌మాట‌. ఈ అంటువ్యాధి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని కొందరు చెబుతుండగా.. కొవిడ్-19 సంక్షోభం స్థానిక దశకు చేరుకుందని కొందరు వైద్యులు .. ఎపిడెమియాలజిస్టులు సూచించారు. వైద్యులు చెబుతున్న ప్ర‌కారం ప్ర‌మాదం ఏదీ లేద‌నేది అంద‌రిలో ఉత్సాహం నింపుతోంది.

దీంతో ఎవ‌రికి వారు త‌మ ప‌నుల్లో దిగిపోతున్నారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి క‌రోనా స‌న్నివేశం పూర్తిగా మారిపోతుంద‌ని కూడా భావిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో తిరిగి షూటింగుల సంద‌డి షురూ అయిపోయింది. ఇప్ప‌టికే యంగ్ హీరోలంతా షూటింగుల‌తో బిజీగానే ఉన్నారు. వారు క‌రోనాని కేర్ చేసిందే లేదు. ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తాయ‌ని ఎవ‌రూ అనుకోవ‌డం లేదు. దీంతో పెద్ద హీరోలు బ‌రిలో దిగిపోతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి .. మాస్ మ‌హారాజా రవితేజ వంటి పెద్ద హీరోలతో షూటింగ్ లను తిరిగి ప్రారంభించారు. ఎవ‌రి ప‌నిలో వారు బిజీగా ఉన్నారు. వెంక‌టేష్‌.. నాగార్జున‌.. మ‌హేష్ లాంటి స్టార్లు ఎవ‌రికి వారు షూటింగుల షెడ్యూల్స్ ని అనుస‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. హీరో నాని ఇప్ప‌టికే ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.

ప్ర‌తి ఒక్క‌రూ ఆన్ లొకేష‌న్ డాక్ట‌ర్ల‌ను నియ‌మించుకుని ఆరోగ్యం స‌రిగా లేని వారికి వైద్యం చేయిస్తున్నారు. జ్వ‌రం ఇత‌ర సింప్ట‌మ్స్ త‌గ్గాక తిరిగి ప‌నిలోకి చేర్చుకుంటున్నారు. అంత‌కుమించి ఎవ‌రూ టెన్ష‌న్ ప‌డ‌డం లేదు. ఇది నిజంగా చాలా పెద్ద మార్పు. ఇంత‌కుముందులా ప్యానిక్ అయ్యే స‌న్నివేశం లేదు ఇప్పుడు. ఒక సాధార‌ణ జ్వ‌రం లా క‌రోనా వ‌చ్చి వెళ్లింద‌న్న భ‌రోసా క‌నిపిస్తోంది.