Begin typing your search above and press return to search.

థియేటర్లకెళ్తే కాసులు వస్తాయా ?

By:  Tupaki Desk   |   15 July 2019 4:56 AM GMT
థియేటర్లకెళ్తే కాసులు వస్తాయా ?
X
సినిమా వసూళ్లు పెంచుకోవడం కోసం దర్శక నిర్మాతలు హీరోలు హీరోయిన్లు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. హాల్ దాకా ప్రేక్షకుడిని రప్పించడం రాను రాను గగనమైపోతోంది. వీకెండ్స్ ని ఏదోలా లాగించినా మిగిలిన ఐదు రోజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా మిక్స్డ్ రిపోర్ట్స్ వినిపించినా ప్రేక్షకులు కనికరం లేకుండా ఇంటికే పరిమితమైపోతున్నారు. అందుకే ప్రజల వద్దకు నాయకులు వెళ్లిన తరహాలో ఇప్పుడు తారలే థియేటర్లకు వెళ్లి మరీ జనాన్ని పలకరిస్తున్నారు.

నిజానికి ఇవి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయా అంటే అంతగా లేదనే చెప్పాలి. సదరు యూనిట్ లు వెళ్తోంది ఆల్రెడీ షోలు రన్ అవుతున్న థియేటర్లకు. అంటే సినిమా చూడాలని డిసైడ్ అయ్యి టికెట్ కొన్న ప్రేక్షకులను మళ్ళి పలకరిస్తున్నారు తప్పించి అసలు అక్కడి దాకా రానివారిని ఎలా రప్పించుకోవాలి అనే దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఏది లేకపోవడం కన్నా ఇలా ఏదో ఒకటి చేయడం బెటర్ కదా అన్న ఆలోచన అందరు వివిధ ప్రాంతాలను ఎంచుకుని మరీ థియేటర్ల బాట పడుతున్నారు.

సందీప్ కిషన్ తన నిను వీడని నీడను నేనే కోసం ఇదే పని మీద తిరుగుతున్నాడు. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ మొన్న వచ్చిన వాటిలో ఇదే కాస్త నయం అన్న మాట విన్పించడంతో దాన్ని ఉపయోగించుకునే పనిలో పడ్డాడు. ఐస్మార్ట్ శంకర్ వచ్చే లోపు రౌండ్లు కొట్టేస్తే కలెక్షన్స్ పెంచుకోవచ్చని నమ్మకం. మొదటిరోజు కోటిన్నర దాకా రాబట్టిన నీడ ఇప్పుడీ వారం సగం ఆక్యుపెన్సీ మైంటైన్ చేసినా చాలు నిర్మాత సేఫ్ అయిపోతాడు. మరి సందీప్ కిషన్ నమ్మకం ఎంత వరకు నిలబడుతుందో మొదటి వారం పూర్తయితే కానీ చెప్పలేం