చిరు రాకతో నా చిన్నప్పటి కోరిక నెరవేరింది

Wed Nov 24 2021 10:12:32 GMT+0530 (IST)

With The Arrival Of Chiru My Childhood Wish Came True

ఆర్ ఎక్స్ 100 సినిమా తో హీరోగా పరిచయం అయిన కార్తికేయ వరుసగా సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తమిళంలో అజిత్ సినిమా వాలిమైలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఆ సినిమా తో తమిళంలో మంచి స్టార్ గా ఈయన గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ప్రేమిస్తున్న అమ్మాయిని ఇటీవలే కార్తికేయ పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యి నూతన వధు వరులను ఆశీర్వదించాడు. కార్తికేయ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు మెగాస్టార్ రాకతో ఆనందంలో మునిగి పోయారు.చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని అనే విషయం తెల్సిందే. పలు సందర్బాల్లో ఆ విషయాన్ని కార్తికేయ చెప్పుకొచ్చాడు. ఒక్కసారి చూస్తే చాలు అనుకున్నా అంటూ ఒకానొక సందర్బంలో కార్తికేయ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత పలు సందర్బాల్లో మెగాస్టార్ చిరంజీవి గురించి కార్తికేయ మాట్లాడుతూనే వచ్చాడు. తనను అంతగా అభిమానించే కార్తికేయ వివాహ వేడుకకు చిరంజీవి హాజరు కాకుండా ఎలా ఉండగలరు. అంతా అనుకున్నట్లుగానే చిరంజీవి కార్తికే వివాహ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా అతడి కుటుంబ సభ్యులతో కూడా కొద్ది సమయం మాట్లాడారని తెలుస్తోంది.

తన పెళ్లికి చిరంజీవి హాజరు అవ్వడం పట్ల కార్తికేయ స్పందించాడు. చిన్నప్పుడు హీరో అవ్వాలని.. నా పెళ్లికి చిరంజీవి హాజరు అవ్వాలని కోరుకున్నాను.. నా చిన్నప్పటి కోరికలు అయిన హీరో అవ్వడం.. నా పెళ్లికి చిరంజీవి గారు రావడం రెండు జరిగింది. జీవితంకు ఇంతకు మించిన అదృష్టం ఏం ఉంటుంది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. పెళ్లికి వచ్చి మమ్ములను ఆశీర్వదించినందుకు గాను మీకు కృతజ్ఞతలు.. లవ్ యూ సర్ అంటూ కార్తికేయ ట్వీట్ చేశాడు.

సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక కార్తికేయ ఇటీవలే రాజా విక్రమార్క సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఆ సినిమా నటుడిగా మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ఇక తమిళ వాలిమై కోసం అంతా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఆ సినిమా రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఖచ్చితంగా కార్తికేయ కెరీర్ పీక్స్ కు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.