Begin typing your search above and press return to search.

అనసూయగా ఇష్క్‌ పంచేందుకు వస్తున్న వింక్ బ్యూటీ

By:  Tupaki Desk   |   18 April 2021 7:43 AM GMT
అనసూయగా ఇష్క్‌ పంచేందుకు వస్తున్న వింక్ బ్యూటీ
X
మలయాళం మూవీ ఒరు ఆదార్ లవ్ సినిమా తో ఒక్కసారిగా యావత్ దేశానికి పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఆ సినిమా ఫలితం పక్కన పెడితే ఆ సినిమా లో ఈమె కన్ను గీటే సన్నివేశం మరియు ముద్దుగన్‌ పేల్చే సన్నివేశాలు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలోనే ప్రియా ప్రకాష్‌ వారియర్ కు తెలుగు నుండి ఆఫర్లు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలను వదిలేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ఉంది. ఇటీవలే నితిన్ తో చేసిన 'చెక్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ 'ఇష్క్‌' తో తేజ సజ్జాతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఇష్క్‌ సినిమాలో ప్రియా ప్రకాష్‌ వారియన్‌ ఒక పల్లెటూరు కాలేజ్‌ అమ్మాయిగా కనిపించబోతుందట. అనసూయ పాత్ర లో ప్రియా ప్రేక్షకులకు ఇష్క్‌ ను పంచేందుకు వస్తుందట. ఇప్పటి వరకు కమర్షియల్‌ గా ఒక్క సక్సెస్‌ ను కూడా దక్కించుకోలేక పోయిన వింక్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఈ సినిమా పై నమ్మకం పెట్టుకుని ఉంది. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తాను చేసిన అనసూయ పాత్రను ప్రేక్షకులు ఓన్‌ చేసుకుంటారనే నమ్మకంను వ్యక్తం చేస్తోంది.

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కోసం అన్ని మీడియాల ద్వారా ఈ అమ్మడు ప్రమోషన్‌ అయితే చేస్తోంది. తన ముద్దుగన్‌ మరియు కన్ను గీటే సన్నివేశాలను ప్రమోషన్ లో రిపీట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు. ఈ సినిమా సక్సెస్‌ అయితేనే ప్రియా వారియర్‌ సినీ కెరీర్ గాడిలో పడ్డట్లు అవుతుందని.. ఈ సినిమా నిరాశ పర్చితే సినిమాల కోసం మళ్లీ వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.