Begin typing your search above and press return to search.

హాలీవుడ్ మూవీ పై ఈ స్టార్ హీరో క్లారిటీ ఇస్తాడా..??

By:  Tupaki Desk   |   22 Feb 2021 3:22 PM GMT
హాలీవుడ్ మూవీ పై ఈ స్టార్ హీరో క్లారిటీ ఇస్తాడా..??
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. టెంపర్ సినిమా నుండి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తనకు మూడు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే షూటింగ్ చివరిదశలో ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ee ఏడాది అక్టోబర్ 13న విడుదల కాబోతుంది. ఈ హిస్టోరికల్ సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, కొమరం భీమ్ క్యారెక్టర్ ప్రోమోలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

అయినను పోయిరావలె హస్తినకు అనే పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమా షూటింగ్ ఆర్ఆర్ఆర్ పూర్తయిన వెంటనే ప్రారంభం చేస్తామని త్రివిక్రమ్ ఇదివరకు తెలిపాడు. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు అరవిందసమేత మూవీ రూపొంది సూపర్ హిట్ అందుకుంది. అందుకే ఈ సెకండ్ కాంబినేషన్ పై కూడా అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

అదేంటంటే ఎన్టీఆర్ త్వరలోనే హాలీవుడ్ సినిమాలో నటించనున్నాడని. ఈ క్రేజీ రూమర్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తెరకెక్కించనున్న కొత్త సినిమాలో ఓ పాత్రకోసం ఎన్టీఆర్ ను సంప్రదించినట్లు టాక్. మరి క్రేజీ రూమర్ నిజమా కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఎవరైనా కావాలని సృష్టించిన పుకారే కావచ్చని ఇండస్ట్రీ గుసగుసలాడుతుంది. ఒకవేళ ఇది రూమర్ అయితే లైట్ తీసుకోవడమే లేదా నిజమని తెలిస్తే మాత్రం సంతోషించాల్సిందే. ఎందుకంటే ఓ టాలీవుడ్ హీరో హాలీవుడ్ సినిమాలో కనిపించడం విశేషమే కదా అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.