Begin typing your search above and press return to search.

ఈ క్రేజీ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందా..??

By:  Tupaki Desk   |   3 May 2021 1:30 PM GMT
ఈ క్రేజీ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందా..??
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఆగిపోయింది. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండటంతో అలాగే హీరో అల్లు అర్జున్ కరోనా బారినపడటంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అలాగే ఇండస్ట్రీ అంతా షూటింగ్స్ నిలిపేసి పోస్ట్ ప్రొడక్షన్ - ఎడిటింగ్ లాంటి పనులు చూసుకుంటున్నారు. అయితే గతవారం హీరో అల్లు అర్జున్ కరోనా బారినపడి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్నట్లు.. త్వరలోనే ఐసొలేషన్ కు వెళ్లనున్నాడట. అలాగే పుష్ప టీమ్ లో కరోనా పాజిటివ్ వచ్చినవారు.. రానివారు అందరూ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమా 60% కంప్లీట్ అయినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఓ రఫ్ అండ్ రస్టెడ్ విలేజ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడు.

ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ కాగా.. మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ నుండి వస్తున్న రియలిస్టిక్ మూవీ ఇది. అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. అలాగే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. మరి ఈ స్టార్ కాంబో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంటారా లేదా చూడాలి. ఇప్పటికే సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు 13న రిలీజ్ అని చెప్పారు కానీ కరోనా కారణంగా డేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉందేమో చూడాలి.