Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డైరెక్టర్ మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తాడా..??

By:  Tupaki Desk   |   23 Jan 2021 12:30 PM GMT
ఆ స్టార్ డైరెక్టర్ మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తాడా..??
X
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీఎంట్రీ ఎప్పుడని అంతా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు ఆరుపదుల వయసులో కూడా బాలయ్య ఇప్పటికి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురైనా సరే.. బాలయ్య ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. గతేడాది తన 106వ సినిమా టీజర్ వదిలి ఇంకా తను ఫామ్ లోనే ఉన్నానంటూ గుర్తుచేసాడు. మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా పై నందమూరి అభిమానులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునేలా టీజర్ లో బాలయ్య లుక్ చూపించాడు బోయపాటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి పక్కన పెడితే.. తాజాగా మరోసారి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ పేరు బయటికి వచ్చింది.

మోక్షజ్ఞ సినీ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని కొన్నేళ్లుగా అందరి బుర్రలో మెదులుతున్న ప్రశ్న. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.. అనుకున్న ప్రతిసారి బాలయ్య - మోక్షజ్ఞలు అభిమానులను నిరాశకు గురిచేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. అది కూడా ఓ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో.. అదేవరో కాదు. డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పూరీ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసి వినిపించాడట. ఆ స్క్రిప్ట్ విని బాలయ్య కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక రానున్న జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను ప్రకటిస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం పూరీజగన్నాథ్ విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తవగానే మోక్షజ్ఞ సినిమా ప్రారంభం చేస్తాడని వినికిడి. ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.