సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ అవుతుందా..??

Wed May 18 2022 13:00:01 GMT+0530 (IST)

Will the sarkaru vaari paata make their break even

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే వారంతం తర్వాత కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది.'సర్కారు వారి పాట' అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసినట్లు ప్రకటించిన మేకర్స్.. అధికారికంగా పోస్టర్స్ రిలీజ్ చేశారు. అయితే అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని.. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేని సినిమాకి ఈ రేంజ్ లో వసూళ్ళు రావడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేశారు.

ఇటీవల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడడం కష్టమైపోయింది. అందుకే ఫస్ట్ వీకెండ్ లోనే ఎక్కువ రాబట్టాలని ట్రై చేస్తున్నారు. అయితే మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సర్కారు వారికి ఇన్ని కోట్ల షేర్ ఎలా సాధ్యమైందని సందేహిస్తున్నారు.

ప్రొడ్యూసర్స్ చెప్పినంత కలెక్షన్స్ నిజంగా వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే.. వీక్ డేస్ లో 'సర్కారు వారి పాట' వసూళ్ళలో డ్రాప్ స్పష్టంగా కనిపించింది. సోమవారం కంటే మంగళవారం కలెక్షన్స్ అనుకున్న దాని కంటే ఎక్కువ డ్రాప్ అయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోమహేశ్ బాబు సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది.

కాకపోతే రెండో వీక్ లో ‘శేఖర్’ మినహాయిస్తే చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. ఇది 'సర్కారు వారి పాట' చిత్రానికి కలిసొచ్చే అంశం. ఈ వారాంతంలో వచ్చే వసూళ్ల మీద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి బాక్సాఫీస్ వద్ద అప్పటి వరకు మహేశ్ సినిమా బలంగా నిలబడుతుందో లేదో చూడాలి.

కాగా 'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆర్ మది సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు.