Begin typing your search above and press return to search.

కన్ను గీటిన సుందరి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారేనా..?

By:  Tupaki Desk   |   27 Feb 2021 11:30 PM GMT
కన్ను గీటిన సుందరి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారేనా..?
X
ప్రియా ప్రకాష్ వారియర్.. కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ. 2019లో 'ఒరు అడార్ లవ్' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ వింక్ గర్ల్ గా ఫేమస్ అయింది. ఈ సినిమా తెలుగులో 'లవర్స్ డే' పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'శ్రీదేవి బంగ్లా' అనే హిందీ సినిమాలో.. 'విష్ణు ప్రియ' అనే కన్నడ సినిమాలో నటించింది ప్రియ. నిజానికి వింక్ గర్ల్ గా వచ్చిన ఈ క్రేజ్ తో ఈవెంట్లు.. షాపింగ్ మాల్ యాడ్స్ అంటూ బాగానే క్యాష్ చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాల్లో మాత్రం అనుకున్నంత రేంజ్ లో రాణించ‌లేక‌పోయిందనే కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలో యూత్ స్టార్ నితిన్ సరసన ''చెక్'' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.


క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన 'చెక్' శుక్రవారం విడుదలైంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా హీరోయిన్ గా నటించింది. అప్ప‌ట్లోనే ఒప్పుకున్న 'చెక్' ప్రియాకు తొలి తెలుగు సినిమా. అయితే నిన్న సినిమా విడుదలయ్యాక అమ్మడిని తెర మీద ఎక్కువసేపు చూడ‌లేక‌పోయామని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. అంతేకాక ఈ బ్యూటీకి చెప్పుకునేంత రోల్ లేక‌పోవ‌డం ఒక ఎత్తైతే.. అది కూడా నెగిటివ్ రోల్ అవడం మ‌రో ఎత్తని అంటున్నారు.

ప్రస్తుతం ప్రియా ప్రకాష్ చేతిలో మరో తెలుగు సినిమా ఉంది. యువ హీరో తేజ సజ్జా నటిస్తున్న ''ఇష్క్'' - 'నాట్‌ ఎ లవ్‌స్టోరీ' అనే సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రానికి యస్‌.యస్‌.రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా ప్రకాష్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతుందా లేదా అనేది ఈ సినిమాతో తెలిపోతుందని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.