ఫ్యూచర్ లో లేడీ యాక్షన్ స్టార్ గా మారిపోతుందేమో..!

Thu Jun 24 2021 09:00:02 GMT+0530 (IST)

Will the lady become an action star in the futureWill the lady become an action star in the future

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శృతి హాసన్.. 'కాటమరాయుడు' తర్వాత తెలుగు సినిమా చేయడానికి చాలా సమయమే తీసుకుంది. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన శృతి.. 'వకీల్ సాబ్' తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ''సలార్'' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ - శృతి హాసన్ జంటగా నటిస్తున్న 'సలార్' చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి డైలీ ఏదొక రూమర్ వస్తూనే ఉంది. లేటెస్టుగా హీరోయిన్ శృతి హాసన్ పాత్రకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

'సలార్' చిత్రంలో శృతి యాక్షన్ సీక్వెన్సెలలో పాల్గొననుందట. దీని కోసం ఆమె ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో మెళకువలు నేర్చుకుంటోందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ సినిమా 'లక్' లో యాక్షన్ సీన్స్ లో నటించిన శృతి హాసన్.. ఇటీవల వచ్చిన 'క్రాక్' సినిమాలో ఫైట్స్ చేసి అదరగొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు 'సలార్' లో కూడా ఆమె నుంచి యాక్షన్ చూడబోతున్నామని అంటున్నారు. చూస్తుంటే ఫ్యూచర్ లో శృతి లేడీ యాక్షన్ స్టార్ గా మారిపోతుందేమో..!