Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవుతాడా..?

By:  Tupaki Desk   |   22 Feb 2021 10:30 AM GMT
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవుతాడా..?
X
కమర్షియల్ సినిమాలకి తనదైన శైలిలో కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పిస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. 'గాలి సంపత్' సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మెంటర్ గా కూడా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకుంటున్నాడు. టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు - న‌ట‌కిరీటి రాజేంద్ర ‌ప్ర‌సాద్ ప్రధాన పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా మార్చి 11న రాబోతున్న మ‌రో మూడు సినిమాల‌తో కలిసి వార్ లోకి దిగ‌బోతుంది.

వాస్త‌వానికి 'గాలి సంపత్' సినిమా షూటింగ్ చాలా స్పీడుగా కంప్లీట్ చేశారు. ఈ సినిమా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి ద‌ర్శ‌కుడు అనిశ్ కంటే అనిల్ రావిపూడి పేరే ఎక్కువ వినిపిచింది. అనిల్ రావిపూడి త‌నకొచ్చిన బ్రాండ్ తో ఈ సినిమా మార్కెటింగ్ చేసినా స‌రే డ‌బ్బులు వెన‌క్కి రాక‌పోతే మాత్రం ఆ ఎఫెక్ట్ ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తున్న 'ఎఫ్ 3' మీదే ప‌డే అవ‌కాశం ఉందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. అనిల్ పాపులారిటీ డైరెక్టర్ అనీష్ ని తొక్కేసే అవకాశం కూడా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌రకు ద‌ర్శ‌కుడుగా క‌మ‌ర్షీయ‌ల్ స‌క్సెస్ లు అందుకున్న అనిల్ రావిపూడి.. మరి 'గాలి సంప‌త్' సినిమాతో నిర్మాత‌గా కూడా స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి.