Begin typing your search above and press return to search.

ఈసారైనా యువ హీరో కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా..?

By:  Tupaki Desk   |   28 Sep 2022 2:30 AM GMT
ఈసారైనా యువ హీరో కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా..?
X
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన 'Rx 100' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం బాగా కష్టపడున్నాడు.

హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వకుండా.. మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు విలన్ గానూ మెప్పిస్తున్నాడు. అయితే Rx100 తర్వాత కార్తికేయకు హీరోగా సరైన సక్సెస్ అందడంలేదు. పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు.

గతేడాది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ నటించిన 'చావు కబురు చల్లగా' చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇదే క్రమంలో వచ్చిన 'రాజా విక్రమార్క' సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలా కార్తికేయ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కార్తికేయ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న #Kartikeya8 మూవీ ఒకటి. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో ఓ ఆసక్తికరమైన ప్రయాణం కొనసాగుతోందంటూ ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

అయితే ఆ తర్వాత యూవీ టీమ్ తో కార్తికేయ చేస్తున్న సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఇప్పటికే ఈ మూవీ పూర్తయిందని తెలుస్తోంది. సినిమా మాతృ సో సోగా ఉందని.. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇకపోతే కార్తికేయ ఇటీవల తన 9న సినిమా ''బెదురులంక 2012'' టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి. యువరాజ్ సమర్పిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై 'కలర్ ఫొటో' నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.

'బెదురులంక 2012' అనేది గోదావరి నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా. సొసైటీకి నచ్చినట్లు బతకడం సరైందా? మనసుకు నచ్చినట్టు బతకడం సరైనదా? అనే పాయింట్ మీద ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇదిలా ఉంటే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కార్తికేయ హీరోగా అప్పట్లో ఓ చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాదు.. స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కూడా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి కొత్త అప్డేట్ లేదు.

ఇలా కార్తికేయ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగా.. మరొకటి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది తెలియడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వస్తున్నాయి కాబట్టి.. యువ హీరో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతని ఆశలన్నీ ముందుగా వచ్చే యూవీ క్రియేషన్స్‌ సినిమాపైనే ఉన్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.