Begin typing your search above and press return to search.

జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   25 Jun 2022 8:30 AM GMT
జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా?
X
కామెడీ అంశాల‌కు ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని జోడించి ఆద్యంతం న‌వ్వులు పూయించే క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన చిత్రం 'జాతిర‌త్నాలు'. న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించిన ఈ మూవీలోని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి న‌టించారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ పై యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని నిర్మించారు. 'పిట్ట‌గోడ‌' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అనుదీప్ కె.వి. ఈ మూవీని రూపొందించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ మేక‌ర్స్ కి 65 నుంచి 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని కురిపించి ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు సినీ పండితుల్ని కూడా విస్మ‌యానికి గురిచేసింది. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ సాధించిన వ‌సూళ్ల‌ని ఓ మ్యాజిక్ గా ట్రేడ్ వ‌ర్గాలు అభివ‌ర్ణించాయి. చిన్న సినిమా స్టార్ హీరో మూవీ రేంజ్ లో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో 'జాతిర‌త్నాలు' మూవీ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

ఈ మూవీతో హీరో న‌వీన్ పొలిశెట్టి మ‌రింత‌గా శైన్ అయ్యాడు. హీరోగా మ‌రింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ఈ రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిందంటే త‌ను ఈ సినిమాని ఏ స్థాయిలో త‌న భుజాల‌పై మోసాడో అర్థం చేసుకోవ‌చ్చు.

జోగీపేట శ్రీ‌కాంత్ పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ పాత్రని తెర‌పై చాలా జోవియ‌ల్ గా పండించి సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఇక ఈ మూవీతో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు అనుదీప్ కె.వి ప్ర‌స్తుతం త‌మిళ క్రేజీ హీరో శివ‌కార్తీకేయ‌న్ తో ఓ బై లింగ్వ‌ల్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. 'ప్రిన్స్‌' పేరుతో ఈ మూవీని డి. సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహ‌న్ రావుతో క‌లిసి సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.

మ‌రియా బోష్ప‌క హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అయితే 'జాతిర‌త్నాలు' చిత్రంతో బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేసిన అనుదీప్ కెవి.. 'ప్రిన్స్‌' మూవీతో ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.