Begin typing your search above and press return to search.

వారితో పోలిస్తే నాని ప్రొడ్యూస‌ర్ గా హిట్టేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 1:30 AM GMT
వారితో పోలిస్తే నాని ప్రొడ్యూస‌ర్ గా హిట్టేనా?
X
టాలీవుడ్ లో చాలా వ‌ర‌కు హీరోలు సినిమాలు చేస్తూనే నిర్మాత‌లుగానూ త‌మ అదృస్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయి నిర్మాత‌లుగా కాకుండా న‌చ్చిన సినిమాల‌కు స‌హ భాగ‌స్వాములుగా మాత్ర‌బు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పై, మ‌హేష్ బాబు జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్ పై, ర‌వితేజ ఆర్. టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ తో .. ఇలా ప‌లువురు హీరోలు తాము న‌టిస్తున్న సినిమాల‌కు త‌మ బ్యాన‌ర్ ల‌ని పెట్టుకుని స‌హ నిర్మాత‌లుగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కానీ నేచుర‌ల్ స్టార్ నాని మాత్రం ఇత‌ర హీరోల‌కు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై సోలో నిర్మాత‌గా సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టాడు. `అ!` అంటూ స‌రికొత్త సినిమాతో నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించిన నాని అదే పంథాలో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. తొలి సినిమా ప్ర‌యోగం అనిపించుకుందే కానీ ఆశించిన స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ని అందించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత మాస్ కాదాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా శైలేష్ కొల‌ను ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన `హిట్ ` మంచి విజ‌యాన్ని అందించింది.

అయితే హీరో నానికి నిర్మాత‌గా తొలి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ని మాత్రం `హిట్ 2` అందించింద‌ని తెలుస్తోంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోతో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా తొలి రోజు రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. త్వ‌ర‌లో యుఎస్ మార్కెట్ లో వ‌న్ మిలియ‌న్ మార్కుని దాట‌బోతోంది. తెలుగులో `హిట్ 2` స‌క్సెస్ టాక్ ని సొంతం చేసుకోవ‌డంతో ఈ మూవీని ఇత‌ర భాష‌ల్లో డ‌బ్బింగ్ కోసం అడుగుతున్నార‌ట‌.

ఇది నానికి అద‌న‌పు ప్రాఫిట్ ని అందించ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇత‌ర హీరోలు స‌హ నిర్మాత‌లుగా పేర్లు వేసుకుంటూ నిర్మాణంలో నామ మాత్రంగా వుంటుంటే నాని మాత్రం వారికి భిన్నంగా పూర్తి స్థాయి నిర్మాత‌గా వ‌రుస సినిమాల‌ని నిర్మిస్తుండ‌ట‌మే కాకుండా హిట్ 2తో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. దీంతో నాని క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూస‌ర్ గా హిట్ట‌యిన‌ట్టే అంటున్నారు. `వి` మూవీ నుంచి ఓ ఫ్లాప్ ఓ హిట్ అంటూ ముందుకు సాగుతున్న నాని నిర్మాత‌గా మాత్రం అభిరుచి గ‌ల నిర్మాత‌గా పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

గ్యాంగ్ లీడ‌ర్, వీ ఆ త‌రువాత ట‌క్ జ‌గ‌దీష్ వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నానికి హీరోగా చేదు ఫ‌లితాల్ని అందించాయి. `శ్యామ్ సింగ‌రాయ్‌` హిట్ అయినా ఆ త‌రువాత వ‌చ్చిన `అంటే సుంద‌రానికి పెద్ద‌గా ఆడ‌లేదు. ఇలాంటి త‌రుణంలో నిర్మాత‌గా `హిట్ 2` విజ‌యాన్ని అందించి నానికి ఊర‌ట క‌లిగించింది. ప్ర‌స్తుతం హీరోగా నాని దృష్టి అంతా `ద‌స‌రా`పైనే వుంది. ఊర మాసీవ్ పాత్ర‌లో నాని న‌టిస్తున్న ఈ మూవీ 2023 మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కొత్త ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో చేస్తున్న ఈ మూవీ నాని న‌మ్మ‌కాన్ని ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.