Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాలో మహేష్ హీరోయిన్ నటించనుందా..?

By:  Tupaki Desk   |   2 Aug 2020 2:30 AM GMT
ఎన్టీఆర్ సినిమాలో మహేష్ హీరోయిన్ నటించనుందా..?
X
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ పై మంచి క్రేజ్ ఏర్పడింది. వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా 2018లో బ్లాక్ బస్టర్ లలో ఒకటి. ఎన్టీఆర్ కెరీర్లో అరవింద సమేత మంచి విజయాన్ని సాధించింది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలిస్తే కొత్తరకం బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఆశించవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజిగా ఉన్నాడు. త్రివిక్రమ్ నుండి అల వైకుంఠపురంలో తర్వాత వస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్ 30వ సినిమా. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులలో ఉన్నాడట. కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు మేకర్స్. పొలిటికల్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక హీరోయిన్ బాగుంటుందని భావిస్తున్నారట. ఆమె ఎవరో కాదు కియారా అద్వానీ. భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. రాంచరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే అమ్మడిని ఓకే చేసే ఆలోచనలో త్రివిక్రమ్ టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ నిజమైతే గనక కియారా భారీ ఆఫర్ కొట్టేసినట్లే అని చెప్పవచ్చు.