Begin typing your search above and press return to search.

ఆ సినిమాలతో అయినా సూర్య హిట్ కొడతాడా...?

By:  Tupaki Desk   |   15 Oct 2019 5:40 AM GMT
ఆ సినిమాలతో అయినా సూర్య హిట్ కొడతాడా...?
X
హీరో సూర్య హిట్ సినిమా ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. 2010లో వచ్చిన 'సింగం' సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ సూర్యకి మళ్ళీ రాలేదు. కొన్ని సంవత్సరాల నుండి సూర్య నుండి వస్తున్న సినిమాలు ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. సూర్య సెలెక్ట్ చేసుకుంటున్న కథలలోనే లోపాలు కనపడుతున్నాయి. ఇంతకుముందు 'శివపుత్రుడు, గజిని' లాంటి విభిన్న కథలను ఎంచుకునే సూర్య ఈ మధ్య పక్కా రొటీన్ సినిమాలతో అభిమానులు కూడా చూడలేని సినిమాలు చేస్తున్నాడు. అలా అని సూర్యకి టాలెంట్ లేదా...? అంటే కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి నటులు సూర్య, విక్రమ్ లాంటి వాళ్ళు. అలాంటి సూర్య నుండి తాజాగా వచ్చిన సినిమా 'కాప్పాన్' కి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదంటే సూర్య ప్రస్తుతం ఎంత డౌన్ ఫాల్ లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.

సూర్యకి తమిళం లోనే కాదు తెలుగులో కూడా ఒక స్టార్ హీరోకి ఉన్నంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో సూర్యకి ఉన్న లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అందుకే సూర్య వరుస ప్లాప్స్ ఇస్తున్నా వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సూర్య డైరీ నిండిపోయింది. ఇంక ఒక సంవత్సరం వరకు అతని డేట్స్ ఖాళీ లేవు. సూర్య ఇప్పుడు 'సూరరై పోట్రు' అనే సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే సూర్య తాను తర్వాత చేసే సినిమాలపై దృష్టి పెట్టాడు. దర్శకుడు గౌతమ్ మీనన్ తో తనకు ఉన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి అతనితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు తనకు 'శివపుత్రుడు' లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ బాల తో, 'సింగం' మూవీ డైరెక్టర్ హరితో వరుసగా సినిమాలు చేయాలని సూర్య ప్లాన్ చేస్తున్నాడు. రాబోయే సినిమాలతో అయినా సూర్య హిట్ కొడతాడేమో చూడాలి.