ఈ ఫార్మాట్ లో సుధీర్ బాబు హిట్ కొట్టేనా?

Tue Jan 24 2023 11:15:51 GMT+0530 (India Standard Time)

Will Sudheer Babu hit in this format?

ఖాకీ యూనిఫాం చాలా మందికి హిట్టు సినిమాలను ఇచ్చింది. ఒక్కసారి ఈ యూనిపాం వేసి సినిమాలో నటించిన వారికి సూపర్ క్రేజ్ తీసుకు వచ్చేలా చేసింది. ముఖ్యంగా హీరో సూర్య రవితేజ వంటి వాళ్లకూ ఈ యూనిఫాం ఎప్పుడూ విజయాన్నే తెచ్చి పెట్టింది. అలాగే విశ్వక్ సేన్ అడవి శేష్ వంటి వాళ్లు మొదటి సారి యూనిఫాం ధరించినప్పుడు కూడా సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు హంట్ సినిమా ద్వారా సుధీర్ బాబు ఖాళీ యూనిఫాం వేయబోతున్నాడు.సుధీర్ కొన్ని చిత్రాల్లో.. పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించాడు. ఖాకీ యూనిఫాం వేసి కాసేపే కనిపింనప్పటికీ పెద్దగా హిట్టు కొట్టలేదు. నాని నటించిన వి శ్రీవిష్ణు హీరోగా నటించిన వీరభోగ వసంత రాయులు వంటి చిత్రాల్లో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.

అయితే ఈ సినిమాల్లోనూ తక్కువ సేపే కనిపించాడు. ఇవి కూడా పెద్దగా సక్సెక్ సాధించలేకపోయాయి. కానీ ఈసారి సుధీర్ బాబు ఫుల్ టైం హీరోగా హంట్ సినిమాలో కనిపించబోతున్నారు. కాబట్టి ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టవుతుందని చాలా మంది భావిస్తున్నారు.

సమ్మోహనం సూపర్ సక్సెస్ తర్వాత సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి సహా ఓ ఒక్కటీ బాబా ఆడలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఇతను ఈ ఇంటెన్స్ కాప్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే ఇది మలయాళ చిత్రం ముంబై పోలీస్ రీమేక్ అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ మంజుల ఘట్టమనేని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే చిత్ర శుక్ల హీరోయిన్ గా నచింటిన ఈ చిత్రం ట్రైలర్.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతే కాకుండా ఖాకీ యూనిఫాం సెంటిమెంట్ వర్కవుట్ అయేతే కచ్చితంగా ఇది సుధీర్ బాబు కెరియర్ లో హిట్ గా నిలుస్తుంది. మరి ఈనెల 26వ తేదీన రిలీజ్ కాబోయే ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధించబోతోందో తెలియాలంయే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.