స్టార్ హీరో.. కిచిడి చేస్తుంటే కిరాక్ రిజల్ట్ వస్తుందా?

Sun Jun 07 2020 13:33:20 GMT+0530 (IST)

Will Star hero Get kirak result?

ఆయన ఓ పెద్ద స్టార్ హీరో. ప్రస్తుతం ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఒరిజినల్ గా కమర్షియల్ కథాంశం కాదు.. కరెక్ట్ గా చెప్తే అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు.  దీంతో హీరో ఇమేజ్ కోసం.. అభిమానుల సంతోషం కోసం చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారట.  కొంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ను అలరించేలా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.అయితే అభిమానులను మెప్పించాలనే ఆలోచన మంచిదే కానీ ఆ పేరుతో ఈ మసాలాలు జోడిస్తే కథలో ఉన్న మెయిన్ సోల్ పోతుందేమోనని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇదో సీరియస్ కథ కావడంతో ఈ మసాలాలు కథను కిచిడిగా మారుస్తాయని కూడా అంటున్నారు.  ఒక ఫార్మాట్ సినిమాకు ఎన్ని మసాలాలు జోడించినా పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఓ సామాజిక అంశంపై సాగే కథ.. సీరియస్ గా సాగాల్సిన కథను ఇలా చేస్తే ఆ కథలో ఉన్న సీరియస్ నెస్ దెబ్బతినే అవకాశం ఉందనే అభిప్రాయం వినబడుతోంది.

కథ ప్రకారం సినిమా తీస్తే పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా కనీసం స్టార్ హీరో ఓ మంచి సినిమాలో నటించాడని పేరు అయినా వస్తుందని.. ఇప్పుడు ఈ మసాలా అంశాల వల్ల సినిమా రెంటికి చెడ్డ రేవడిలా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.  ఇవన్నీ ఒక ఎత్తైతే ఇలాంటి కథ ఎంచుకోవడం అభిమానుల్లోనే చాలామందికి నచ్చలేదు. మరి ఇలాంటి పరిస్థితులలో ఆ సినిమాతో ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్టుకొస్తారో వేచి చూడాలి.