Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి కి స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారా?

By:  Tupaki Desk   |   24 Jan 2020 6:28 AM GMT
అనిల్ రావిపూడి కి స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారా?
X
భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన 'సరిలేరు నీకెవ్వరు'కు మిశ్రమస్పందన దక్కినప్పటికీ మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా తో మొదటి సారిగా అనిల్ రావిపూడి సూపర్ స్టార్ ను మహేష్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. కలెక్షన్స్ భారీగానే వచ్చినప్పటికీ అంచనాలు మాత్రం అందుకోలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా ప్రచార సమయంలో అనిల్ రావిపూడి ఎన్నో చెప్పినప్పటికీ అవేమీ స్క్రీన్ పై వర్క్ అవుట్ కాలేదని ఎక్కువ మంది అంటున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో గట్టెక్కింది కానీ వేరే సీజన్లో అయితే ఈ కలెక్షన్స్ ఉండవి కాదని అంటున్నారు.

మహేష్ తో సినిమా చేసిన అనిల్ రావిపూడి కి ఇకపై స్టార్ హీరోలు అవకాశం ఇస్తారని అనుకున్నారు. అనిల్ కూడా 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ సమయంలో ఒక టాప్ హీరో నెక్స్ట్ సినిమాకు చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి అనిల్ కు అనుకూలం గా లేదని సమాచారం. 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ కు కారణం రిలీజ్ టైమింగ్.. మహేష్ బాబు స్టార్డమ్ లాంటి కారణాలేనని.. అనిల్ రావిపూడి పాత్ర పెద్దగా లేదని అభిప్రాయం ఉంది. దీంతో స్టార్ హీరోలెవ్వరూ అనిల్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.

దీంతో అనిల్ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఏం చేస్తాడనే ఆసక్తి నెలకొంది. 'F2' కు సీక్వెల్ గా 'F3' సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది కానీ వెంకీ.. వరుణ్ ఇద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వెంటనే డేట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదని అంటున్నారు. మరి అనిల్ ఏ హీరోతో తన నెక్స్ట్ సినిమా చేస్తాడో వేచి చూడాలి.