ఆ పాత్రను రానా ఓకే చేస్తాడా..?

Sun Mar 29 2020 02:00:01 GMT+0530 (IST)

Will Rana Do That Role?

గతేడాది మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా "అయ్యప్పనుమ్ కోషియం". ఈ సినిమాలో బిజూ మీనన్ పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక హవాల్దారుకి ఒక పోలీస్ ఆఫీసర్ ల మధ్య రగిలిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. బలమైన పాత్ర చిత్రణతో తెరకెక్కించారు డైరెక్టర్ సాచి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మాత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో రూపొందించడానికి నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. మొదటగా బిజూ మీనన్ పాత్రకోసం నటసింహం బాలకృష్ణను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చినా అది నిజం కాదన్నట్లు మిగిలిపోయింది. ఇంకా పృథ్వీరాజ్ పాత్రకోసం రానాతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ పాత్రకోసం రానా కూడా సుముఖత చూపినట్లు వినికిడి. ఇలాంటి బలమైన కథను డీల్ చేసే డైరెక్టర్ ని కూడా వెతుకుతున్నారట నిర్మాత నాగవంశీ. దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రానప్పటికీ లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైతే విషయాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారట.