అక్టోబర్ కూడా ముగియబోతుంది 'పుష్ప' ఎక్కడ?

Sun Oct 18 2020 19:01:20 GMT+0530 (IST)

Will Pushpa Team Start Shooting

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబో మూవీ గత ఏడాది పట్టాలెక్కాల్సి ఉంది. కాని ఏవో కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అల వైకుంఠపురం సినిమా సమయంలోనే ఈ సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది. మొదట అల వైకుంఠపురంలో చేసి ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయాలని బన్నీ ప్లాన్ చేసుకున్నాడు. అల వైకుంఠపురంలో సినిమా విడుదలకు ముందే పుష్ప మొదలయ్యే అవకాశం ఉందని మొదట వార్తలు వచ్చాయి. కాని వాయిదాలు వాయిదాలు పడుతూ చివరకు ఈ ఏడాది మార్చికి ఫైనల్ అయ్యింది. మార్చి నుండి లాక్ డౌన్ అవ్వడంతో మరో ఏడు నెలలు వాయిదా పడింది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు మెల్ల మెల్లగా షురూ అవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పుష్ప సినిమా మొదలు అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. యూనిట్ సభ్యులు కూడా అక్టోబర్ లో ఖచ్చితంగా సినిమా కేరళలో ప్రారంభం కాబోతుందని అన్నారు. కాని అక్టోబర్ కూడా పూర్తి కాబోతుంది ఇంకా పుష్ప సందడి కాదు కదా కనీసం సౌండ్ కూడా వినిపించడం లేదు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కిస్తారు అంటూ బన్నీ మరియు సుక్కు ఫ్యాన్స్ పదే పదే వారిని సోషల్ మీడియా వేదికగా అడుగుతూనే ఉన్నారు.

పుష్పకు ఏదో ఒక అడ్డంకి తగులుతున్న కారణంగా ఈ నెలలో కూడా పట్టాలు ఎక్కించే అవకాశం కనిపించడం లేదు. మరి నవంబర్ లో అయినా సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో కీలమైన పాత్రకు మొదట విజయ్ సేతుపతిని అనుకున్నారు. ఆయన తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసే పక్రియ జరుగుతుందని.. ఆ కారణం వల్ల కూడా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.