Begin typing your search above and press return to search.

ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి అదే టైటిల్ ని ఫిక్స్ చేస్తారేమో..!

By:  Tupaki Desk   |   26 July 2021 10:17 AM GMT
ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి అదే టైటిల్ ని ఫిక్స్ చేస్తారేమో..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సూప‌ర్‌ స్టార్‌ అమితాబ్ బ‌చ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌ పై నిర్మాత సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కుక సమయాన్ని కేటాయించిన మేకర్స్.. ఈ సినిమా షూటింగ్ ను శనివారం గురుపౌర్ణమి సందర్భంగా లాంఛ‌నంగా ప్రారంభించారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌ లో బిగ్ బీ పై ప్రభాస్ క్లాప్ కొట్టడంతో చిత్రీకరణ ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ ని ఆగస్ట్ 2 వరకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

ప్రభాస్ - నాగ్ అశ్విన్ చిత్రానికి ''ప్రాజెక్ట్ - K'' అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టినట్లు చిత్ర బృందం విడుదల చేసిన క్లాప్ బోర్డ్ ని చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో కూడా '#Project-K' పేరుతోనే ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న సినిమా కాబట్టి అదే టైటిల్ ను సినిమాకి ఫిక్స్ చేస్తే బాగుంటుందని డార్లింగ్ అభిమానులు భావిస్తున్నారు.

భారతీయ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో రూపొందే సినిమా కాబట్టి యూనివర్సల్ టైటిల్ గా 'ప్రాజెక్ట్-K' బాగుంటుందని కామెంట్స్ వ్వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ టైటిల్ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేసేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి ప్రాజెక్ట్-K అనేది వర్కింగ్ టైటిల్ అయినా.. దీన్నే టైటిల్ గా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదు.

ఇంతకముందు ''RRR'' సినిమా టైటిల్ విషయంలో ఇదే జరిగింది. రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ పేర్లు మీదుగా '#RRR' అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు. అయితే 'ఆర్.ఆర్.ఆర్' అనే పదం జానాల్లోకి బాగా రీచ్ అవడంతో.. దాన్నే సినిమా టైటిల్ గా మార్చే పరిస్థితి వచ్చింది. దానికి ఏదొక అర్థం ఉండాలి కాబట్టి వివిధ భాషల్లో టైటిల్ ని ప్రకటించారు కానీ.. 'RRR' అనే పేరుతోనే పబ్లిసిటీ చేశారు.

ఇప్పుడు 'ప్రాజెక్ట్-K' విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని అంటున్నారు నెటిజన్స్. భారీ స్కేల్ లో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు అదే హ్యాష్ ట్యాగ్ తో సినిమా పాపులర్ అవుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభాస్ పాన్ వరల్డ్ చిత్రానికి 'ప్రాజెక్ట్-K' అనేది పర్మినెంట్ టైటిల్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు

కాగా, ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రెడీ చేస్తున్నారు. దీని కోసం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో సెట్ల నిర్మాణం చేపడుతున్నారు. ప్రేక్షకులు ఇంతకముందెన్నడూ చూడని ఓ గొప్ప అనుభూతిని ఇవ్వడానికి కృషి చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

'ప్రాజెక్ట్ K' చిత్రానికి లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ - టాప్ నాచ్ టెక్నిషియన్స్ ఇందులో భాగం కానున్నారు. త్వరలోనే ఈ పాన్ వరల్డ్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ని బట్టి చూస్తే అతని కెరీర్ లో సిల్వర్ జూబ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.