Begin typing your search above and press return to search.

ఆ హిట్ ఫార్ములాతో ప్ర‌భాస్‌, రామ్ స‌క్సెస్ అవుతారా?

By:  Tupaki Desk   |   12 Feb 2022 5:15 AM GMT
ఆ హిట్ ఫార్ములాతో ప్ర‌భాస్‌, రామ్ స‌క్సెస్ అవుతారా?
X
ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, ర‌వితేజ‌తో స‌హా ఎంద‌రో హీరోలు పోలీస్ పాత్ర‌ను పోషించి సూపర్‌గా స‌క్సెస్ అయ్యారు. దీంతో పోలీస్ పాత్రలు బాక్సాఫీస్ దగ్గర హిట్ ఫార్ములా మారింది. అయితే ఇప్పుడీ హిట్ ఫార్ములానే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫాలో అవ్వ‌బోతున్నారు.

వాస్త‌వానికి ఈ జనరేషన్ హీరోల్లో రామ్, ప్ర‌భాస్‌లు ఒక్క‌సారి కూడా ఖాకీ డ్ర‌స్ వేయ‌లేదు. కానీ, త్వ‌ర‌లోనూ వీరిద్ద‌రూ పోలీస్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రామ్ ప్ర‌స్తుతం తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో `ది వారియ‌ర్‌` అనే సినిమా చేస్తున్నాడు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా, ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నారు. అయితే ఈ మూవీలో రామ్ ఓ పవ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈయ‌న ఫ‌స్ట్ లుక్ విశేష‌కంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్న ఈయ‌న ఇటీవ‌ల `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` అనే మూవీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. టీ సిరీస్, వంగా పిక్చర్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మితం కాబోతోంది.

అయితే ఈ మూవీలో ప్రభాస్ సైతం పోలీస్‌ ఆఫిసర్‌గా కనిపించబోతున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత భూష‌ణ్ కుమార్ ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో లీక్ చేశారు. మొత్తానికి కెరీర్ స్టార్ట్ అయ‌న ఇన్నేళ్ల‌కు పోలీస్ పాత్ర‌ను ఎంచుకున్న రామ్, ప్ర‌భాస్‌లు ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.