Begin typing your search above and press return to search.

విజయ్ కెరీర్లో 'మాస్టర్' హైలైట్ అవుతుందా..?

By:  Tupaki Desk   |   3 April 2020 3:30 AM GMT
విజయ్ కెరీర్లో మాస్టర్ హైలైట్ అవుతుందా..?
X
ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడులో అంతటి మార్కెట్ ను కలిగి ఉన్నాడు. రజినీకాంత్ తర్వాత ఆ లెవెల్ లో పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరంటే అది విజయ్ మాత్రమే. ఇటీవలే బిగిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొన్న విజయ్ తదుపరి సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'మాస్టర్'. ఈ సినిమా నగరం, ఖైదీ సినిమాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది. విజయ్ 'మాస్టర్' సినిమా తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని సమాచారం.

ఈ మాస్టర్ సినిమా విజయ్ నటించిన గత సినిమాల రికార్డులను తిరగరాస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ రెండు విధాలుగా కన్పించి మెప్పిస్తాడని కోలీవుడ్ కోడై కూస్తుంది. మొదటగా మాఫియా డాన్ గా కనిపించి ఆ తరువాత కాలేజీ ప్రొఫసర్ గా కనిపించ నున్నాడట. ఒక మాఫియా లీడర్ నుండి కళాశాల అధ్యాపకునిగా ఎలా మారాడు.. అనేది ప్రధాన కథాంశంగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. విజయ్-విజయ్ సేతుపతిల పోరు భీభత్సం సృష్టించనుందట. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఆడియో సాంగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఎలాంటి సినీ పోరు జరుగనుందో..