2022లో మహేష్ 'జనగనమణ' రానుందా?

Sun Oct 18 2020 14:40:46 GMT+0530 (IST)

Will Mahesh 'Janaganamana' come in 2022?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూరిల కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో జనగనమణ అనే సినిమా రాబోతుంది అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పూరి కాస్త డౌన్ ఫాల్ అవ్వడం.. మహేష్ బాబు బిజీగా ఉండటం వంటి కారణాలు మరియు ఇతర కారణాల వల్ల సినిమా ఇప్పటి వరకు చర్చల దశకు చేరుకోలేదు. ఒక సారి పూరి చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన మహేష్ బాబు నటించేందుకు ఓకే చెప్పాడు. కాని పూర్తి స్థాయి కథ విషయంలో మాత్రం మహేష్ ను పూరి సంతృప్తి పర్చలేక పోయాడు. మళ్లీ కథ ను మార్చి తీసుకు వస్తానంటూ పూరి చెప్పి ఇప్పటి వరకు వెళ్లలేదట.ఈ లాక్ డౌన్ లో పూరి పలు స్క్రిప్ట్ లపై వర్క్ చేశాడు. అందులో ఒకటి జనగనమణ కూడా ఉందట. ఇటీవలే మహేష్ కు నచ్చే విధంగా కథను రెడీ చేసినట్లుగా సమాచారం అందుతోంది. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు త్వరలో పూరి గారు చెప్పే కథ వినబోతున్నట్లుగా చెప్పాడు. పూరి కూడా జనగనమణ ఆమద్య మరో హీరోతో చేయాలని భావించినా కూడా మళ్లీ మహేష్ నుండి సిగ్నల్స్ రావడంతో ఆగినట్లుగా మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జనగనమణ సినిమా కాస్త ఆలస్యంగా అయినా వీరిద్దరి కాంబోలో పట్టాలెక్కడం మాత్రం కన్ఫర్మ్ అనిపిస్తుంది.

ప్రస్తుతం ఇద్దరికి ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి అవ్వాలంటే టైం పడుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2022లో జనగనమణ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారిలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుందని అంటున్నారు. అది కనుక ఉంటే మరింత ఆసల్యం అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక సమయంలో మాత్రం వీరి కాంబో మూవీ ఉంటుందని ఇండస్ట్రీ వారు మరియు సన్నిహితులు కూడా బలంగా చెబుతున్నారు. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు.