పూతరేకులాంటి పిల్లకి మహేశ్ బాబు జోడిగా ఛాన్స్?

Sun Mar 07 2021 13:00:01 GMT+0530 (IST)

Will Mahesh Give Chance Priyanka

అమ్మాయి అంటే అందంగా .. నాజూకుగా ఉండాలి. ఎంత నాజూకుగా అంటే తమలపాకంత లేతగా .. పూతరేకంత పలచగా.అలాంటి నాజూకు భామగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపిస్తుంది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమైంది. కాస్త కళ్లు పెద్దవి చేసి చూస్తే కందిపోతుందేమో అనేంత నాజూకుగా ఉన్న ఈ పిల్లను చూసిన ప్రేక్షకులు ఆమె అభిమానులుగా చెప్పుకోవడంలోనే ఆనందం ఉందని అనుకున్నారు. తెరపై తేలే చేపపిల్ల మాదిరిగానే ఈ అమ్మాయిని చూసుకున్నారు.చందమామలాంటి పిల్ల ఇలా ఉంటుంది .. కుందనపు బొమ్మలాంటి అమ్మాయి ఇలా ఉంటుంది అని ప్రియాంక అరుళ్ మోహన్ ను ఒక ఉదాహరణగా చూపించవచ్చు. నటన నేర్చిన ఈ చక్కదనం కారణంగానే ఈ బ్యూటీకి 'శ్రీకారం' సినిమాలో ఛాన్స్ తగిలింది. శర్వానంద్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులోను ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ప్రియాంక అరుళ్ మోహన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సుందరి ఏకంగా మహేశ్ బాబు సరసన నాయికగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో అనిల్ కాంబినేషన్లో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా హిట్ కావడంతో మరోసారి ఆయనతో సినిమా చేయడానికి మహేశ్ బాబు ఉత్సాహాన్ని చూపుతున్నాడు. 'ఎఫ్ 3' షూటింగులో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఆ తరువాత చేసే సినిమా మహేశ్ బాబుతోనే అని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఆమె పేరు ఖరారు కావొచ్చని అంటున్నారు. తమిళ సినిమాలతోను ప్రియాంక బిజీ అవుతుండటంతో ముందుగానే ఆమెను సంప్రదించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.