Begin typing your search above and press return to search.

లావణ్య మళ్లీ ఫామ్ లోకి రానుందా..?

By:  Tupaki Desk   |   3 April 2020 2:30 AM GMT
లావణ్య మళ్లీ ఫామ్ లోకి రానుందా..?
X
లావణ్య త్రిపాఠి..'అందాల రాక్షసి' సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. మనోహరమైన రూపం ఆమె సొంతం. భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సినిమా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి అభినయానికి అవకాశమున్న పాత్రలనే ఎంచుకుంటూ తన నటన తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ డెహ్రాడూన్ భామ. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్ లో కూడా నటిస్తూ బిజీగా మారుతోంది. గతేడాది వచ్చిన 'అర్జున్ సురవరం' హిట్ తో మంచి ఊపు మీదున్న లావణ్య సందీప్ కిషన్ సరసన 'ఏ1 ఎక్సప్రెస్' కార్తికేయతో కలిసి 'చావు కబురు చల్లగా' చిత్రాల్లో నటిస్తుంది.

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో హాట్ హాట్ అందాలను ఎరగా వేసి మేల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. ఆ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నాగార్జున–నాగ చైతన్యలను హీరోలుగా పెట్టి 'సోగ్గాడే చిన్నినాయన' సీక్వెల్ 'బంగార్రాజు' తీయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కూడా నటించబోతున్నట్లు సమాచారం. 'సోగ్గాడే చిన్నినాయన'లో హీరోయిన్ గా నటించిన లావణ్య మరి ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తోందా లేక వేరే స్పెషల్ పాత్ర లో కనిపించబోతుందా.. అనేది చూడాలి.