సాహో కోసం ఈగో పక్కన పెడతారా ?

Tue Aug 13 2019 23:00:01 GMT+0530 (IST)

Will Khan Batch Appreciate Saaho Movie This Time

ఇటీవలే జరిగిన ముంబై ప్రెస్ మీట్లో సాహో గురించి మాట్లాడుతూ ప్రభాస్ బాలీవుడ్ ఖాన్ల ద్వయం గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మీడియా ప్రతినిధులు ఏమైనా కాంట్రోవర్సి ఆన్సర్ ఇస్తాడేమో అని రెచ్చగొట్టినా స్మార్ట్ గా తప్పించుకున్నాడు డార్లింగ్. కాని వాస్తవానికి సదరు ఖాన్లకు బాహుబలి సక్సెస్ ఇప్పటికీ జీర్ణం కాలేదన్నది అందరికి తెలిసిన వాస్తవం.చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తనకు ఫోన్ చేసి మెసేజులు పంపి బాహుబలిని మెచ్చుకున్నారని ప్రభాస్ అన్నాడు కాని సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ - అమీర్ ఖాన్ ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు పబ్లిక్ గా బాహుబలి గొప్పదనాన్ని ఒప్పుకోలేదు. పైపెచ్చు చూసే టైం దొరకలేదని తర్వాత స్పందిస్తామని తాపీగా చెప్పారు. అంటే చూస్తే ఎక్కడ పొగడాల్సి వస్తుందో అన్న ఈగో ఫీలింగ్ కావొచ్చు ఇప్పుడు సాహో వంతు వస్తోంది. దాదాపు స్టార్ క్యాస్టింగ్ అంతా బాలీవుడ్ సీనియర్ నటులే ఉన్నారు.

ఇప్పటికే 70 మిలియన్ల వ్యూస్ తో ట్రైలర్ వారం తిరక్కుండానే రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది . కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటె ఆగస్ట్ 30 దేశవ్యాప్తంగా సాహో సునామి ఖాయమే. అప్పుడైనా ఖాన్లలో ఒకరైనా సాహో గురించి లేదా ప్రభాస్ గురించి రెండు ముక్కలు చెప్తారేమో చూడాలి. కనీసం హీరొయిన్ శ్రద్ధా కపూర్ కోసమైనా ఫీడ్ బ్యాక్ ఇస్తారేమో. నిర్మాణ సంస్థ టి సిరీస్ కాబట్టి ప్రమోషన్ లోనూ రిలీజ్ లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సాహో కనక బ్లాక్ బస్టర్ అయితే కరణ్ జోహార్ లాంటి హింది నిర్మాతలు ప్రభాస్ తో హింది స్ట్రెయిట్ డెబ్యు చేయించకుండా వదిలేలా లేరు.