నాగార్జున గారూ.. ఈ డబ్బా ఏంటండీ?

Fri Jul 19 2019 11:54:01 GMT+0530 (IST)

ఎంత మెయింటైన్ చేసినా.. ఫిట్నెస్ మీద ఎంత దృష్టి ఉన్నా.. ఒక వయసు దాటాక లుక్ మెయింటైన్ చేయడం కష్టం. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. ఒక వయసు వచ్చాక వాస్తవాన్ని అంగీకరించి ఒరిజినల్ లుక్ ను చూపించడానికి ప్రయత్నించాలి. సినిమా కోసం మేకప్ వేసుకుని మెయింటైన్ చేస్తే చేయొచ్చు కానీ.. అదే ఒరిజినల్ అన్నట్లుగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తేనే జనాల దృష్టిలో తక్కువ కావాల్సి ఉంటుంది.టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు అదే చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగులో మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే ఫిజిక్ లుక్ పరంగా నాగార్జునే ముందు వరసలో నిలుస్తాడు. ఐతే బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నాడు కానీ.. నాగ్ ముఖంలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

నాగ్ ఫేస్ లో మునుపటి గ్లో కనిపించడం లేదు. ముఖంపైకి ముడతలు కూడా వచ్చాయి. ఐతే ఇప్పుడు ‘మన్మథుడు-2’ చేస్తున్న ఆయన.. వయసు ప్రభావం కనిపించకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంత మేకప్ వేసుకుంటున్నాడు. ఆ విషయం పోస్టర్లు చూస్తే స్పష్టంగా తెలిసిపోతోంది. మేకప్ చాలదన్నట్లు.. ఫొటో షాప్ ఎడిట్లు కూడా చేసి మరీ పోస్టర్లు వదులుతున్నారు. నాగ్ ముఖానికి నునుపు కూడా తెస్తున్నారు. మరి ఇంత ప్రయత్నం చేశాక.. ఇదంతా ఒరిజినల్ అన్నట్లు కలరింగ్ ఇవ్వడమే విడ్డూరం.

తాజాగా ఫేస్ యాప్ లో హీరోలు లేటు వయసులో ఎలా ఉంటారో చూపించే ట్రెండ్ ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ‘మన్మథుడు’ టీం వాళ్లు దీన్ని కూడా ప్రమోషన్ కోసం వాడేస్తున్నారు. ఫేస్ యాప్ లో ‘మన్మథుడు’ నాటి నాగ్ ఫొటో పెట్టి ఇప్పటి రోజులకు ఎలా ఉంటాడో పిక్ తీశారు. దీన్ని ప్రస్తుతం ‘మన్మథుడు’ లుక్‌తో పోల్చి.. చూశారా నాగ్ ఇంకా ఎంత మెయింటైన్ చేస్తున్నాడో అని గొప్పలు పోతున్నారు. కానీ మేకప్ ఫొటో షాప్ ఏదీ చేయకుండా ఫొటో పెట్టి పోల్చి చూస్తే అప్పుడు తెలిసేది నాగ్ మెయింటైనెన్స్ ఎలాంటిదని.