Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ తో 'హిట్ 3' వ‌ర్క‌వుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 8:30 AM GMT
నేచుర‌ల్ స్టార్ తో హిట్ 3 వ‌ర్క‌వుట్ అవుతుందా?
X
ఇప్ప‌డు ఫ్రాంచైజీల డ్రెండ్ న‌డుస్తోంది. ఫ‌స్ట్ పార్ట్ స‌క్సెస్ అయితే దానికి వ‌రుస‌గా ఫ్రాంచైజీలు పుట్టుకు రావడం ఆన‌వాయితీగా మారుతోంది. అలా చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతుండ‌టంతో హీరోలు ఈ త‌ర‌హా ఫ్రాచైజీల‌ని లైన్ లో పెడుతున్నారు. అయితే ఇక్క‌డ విష‌యం ఉంటంటే ఒక్కో ఫ్రాంచైజీకి ఒక్కో హీరోతో చేయ‌డం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన క‌థ‌ల‌తో సాగుతున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ 'హిట్'. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ తో చేసిన ఈ మూవీ హిట్ అనిపించుకున్న విష‌యం తెలిసిందే.

దీంతో దీనికి ఫ్రాంచైజీల‌ని తెర‌పైకి తీసుకురావ‌డం మొద‌లైంది. ఇందులో భాంగా రూపొందించిన 'హిట్ : ది సెకండ్ కేస్‌' రీసెంట్ గా విడుద‌లైంది. అడివి శేష్ హీరోగా న‌టించిన ఈ మూవీని 'హిట్‌' డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను తెర‌కెక్కించాడు. హీరో నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీ ఫ‌ష్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఓవ‌ర్సీస్ లోనూ త్వ‌ర‌లో వ‌న్ మిలియ‌న్ మార్కుని ట‌చ్ చేయ‌బోతోంది. మండే టెస్ట్ ని విజ‌య‌వంతంగా దాటితే ఈ మూవీ రానున్న వారంలో బ్రేక్ ఈవెన్ ని సాధించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అడివి శేష్ కెడీ (కృష్ణ‌దేవ్‌) గా ప‌వ‌ర్ ఫుల్ రూత్ లెస్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించిన ఈ మూవీ ఫ‌స్ట్ డే నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న 'హిట్ 3'లో హీరో, నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తారంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపించిన విష‌యం తెలిసిందే. ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ 'హిట్ 2' ఎండింగ్ లో హీరో నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీస‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇక్క సారి థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ విజిల్స్ వేసి గోల చేశారు.

'హిట్ 3'లోకి నాని ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలియ‌డంతో 'హిట్ 2'కి మించి సీక్వెల్ వుంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం భిన్నంగా వినిపిస్తోంది. 'హిట్ 3'లో నాని రూత్ లెస్ కాప్ గా ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. 'హిట్ 2' ఎండింగ్ లో నాని ఎంట్రీ ఇవ్వ‌డంతో మూవీ డ‌ల్ అయిపోయింద‌ని, సీరియ‌స్ పాత్ర‌లో నాని అల‌రించ‌డం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు విపిస్తున్నాయి. కార‌ణం సీరియ‌స్ పాత్ర‌ల్లో నాని న‌టించిన 'వి' ఏ స్థాయి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే.

ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నాని కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచి అభిమానుల‌తో పాటు నానిని ఇష్ట‌ప‌డే వారిని తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. సో.. 'హిట్ 3' లో నాని సీరియ‌స్ గా సాగే రూత్ లెస్ కాప్ గా క‌నిపిస్తే అత‌న్ని ఆ పాత్ర‌లో చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చ‌ని, నాని అలాంటి పాత్ర‌ల‌కు సూట్ కాడ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ ల‌పై మ‌రి నాని ఏమంటాడో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.