Begin typing your search above and press return to search.

ధమాకా రవితేజ హ్యాట్రిక్ ఫ్లాపుల నుంచి తప్పిస్తుందా..!

By:  Tupaki Desk   |   7 Dec 2022 7:30 AM GMT
ధమాకా రవితేజ హ్యాట్రిక్ ఫ్లాపుల నుంచి తప్పిస్తుందా..!
X
క్రాక్ హిట్ తో కెరీర్ లో మంచి ఊపు తెచ్చుకున్న మాస్ మహరాజ్ రవితేజ ఆ మూవీ తర్వాత మళ్లీ వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు తీశాడు. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ముఖ్యంగా ఈ ఏడాదే ఆ రెండు సినిమాలు రిలీజై అపజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ ఇయర్ రవితేజ 3వ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో ధమాకా మూవీ చేస్తున్నారు రవితేజ.

ఈ సినిమాలో రవితేజ సరసన కన్నడ భామ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో ప్రతిభ చాటిన త్రినాథ రావు నక్కిన ధమాకాని కూడా అదే రేంజ్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

ఈ ఏడాది రవితేజ నుంచి వస్తున్న 3వ సినిమా కాగా ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఇచ్చిన రవితేజ ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. 2021లో క్రాక్ తో హిట్ అందుకున్న రవితేజ ఆ మూవీకి ముందు కూడా నాలుగు వరుస ఫ్లాపులు అందుకున్నాడు. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ఇలా వరుస సినిమాలతో నిరాశపరుస్తూ వచ్చాడు.

వరుస ఫ్లాపులు వచ్చినా మరింత ఫోర్స్ తో రవితేజ క్రాక్ తీశాడు. ప్రస్తుతం అదే విధంగా రెండు ఫ్లాపులు వచ్చినా ధమాకాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు రవితేజ. డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్న ధమాకా మూవీతో ఈ ఏడాది భారీ సినిమాల రిలీజ్ హంగామా ముగిసినట్టే. ఆర్.ఆర్.ఆర్ కాకుండా ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ముఖ్యంగా రాధే శ్యాం, ఆచార్య ఇలా మెగా మూవీస్ అన్ని బాక్సాఫీస్ దగ్గర డీలా పడ్డాయి. కొద్దిపాటి అంచనాలతో వచ్చిన సినిమాలు విజయాలను అందుకున్నాయి.

ఈ ఇయర్ లో మీడియం బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కూడా అలరించాయి. డీజే టిల్లు, బింబిసార, కార్తికేయ 2, సీతారామం, మేజర్, హిట్ 2 లాంటి సినిమాలు టాలీవుడ్ కి హిట్ జోష్ ఇచ్చాయి. మరి రవితేజ ధమాకా ఈ హిట్ లిస్ట్ లో చేరుతుందా లేక రవితేజ ఫ్లాపుల లిస్ట్ లో హ్యాట్రిక్ అవుతుందా అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.