'లవ్ స్టోరీ' ప్రమోషన్స్ లో చైతూ వీటన్నిటికీ క్లారిటీ ఇస్తారేమో..?

Tue Sep 14 2021 08:00:01 GMT+0530 (IST)

Will Chaitu give clarity to all these in Love Story promotions

టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని నాగచైతన్య - సమంత లకు సంబంధించిన వార్తలే హాట్ టాపిక్ గా మారాయి. 2017 లో ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్ వైవాహిక జీవితంలో మనస్పర్థలు వచ్చాయని.. ఇప్పుడు ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇటు చైతూ కానీ.. అటు సమంత కానీ ఇంతవరకు స్పందించలేదు.సమంత తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లో 'అక్కినేని' పేరుని తొలగించడంతో మొదలైన ఈ పుకార్లు.. ఇప్పుడు 'లవ్ స్టోరీ' ట్రైలర్ పై స్పందించడం వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటికీ వీలైనంత తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.  చైతన్య - సామ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. పర్సనల్ లైఫ్ గురించి బయట ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు వెంటనే స్పందిస్తేనే మంచిదని అంటున్నారు.

నాగ చైతన్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండరనే సంగతి తెలిసిందే. సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప మరో దాని గురించి సామాజిక మధ్యమాలలో షేర్ చేసుకోరు. సమంత దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు తన వివాహ బంధంపై ఇన్ని రూమర్స్ వస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే ఇతర పోస్టులు పెడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు చైతూ తన పర్సనల్ లైఫ్ మీద వస్తున్న మీడియాని ఫేస్ చేయాల్సిన సందర్భం రాబోతోంది.

చై నటించిన 'లవ్ స్టోరీ' సినిమాని సెప్టెంబర్ 17న థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హీరో నాగచైతన్య కచ్చితంగా మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. అయితే బేసిక్ గా మీడియా ముందు సిగ్గుపడే వ్యక్తి అయిన చైతూ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి వెల్లడిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో నాగచైతన్య మీడియాతో ఇంటరాక్షన్ ని స్కిప్ చేస్తాడని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం సినిమా ప్రచార కార్యక్రమాల్లో రూమర్స్ పై క్లారిటీ ఇస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ చైతన్య 'లవ్ స్టోరీ' ని ప్రమోట్ చేయడం గురించి.. పర్సనల్ లైఫ్ పై వస్తున్న ఊహాగానాలపై ఎలా స్పందిస్తారనే విషయం గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.