Begin typing your search above and press return to search.

బన్నీ రిస్క్ చేస్తున్నాడేమో!

By:  Tupaki Desk   |   14 Aug 2019 9:31 AM GMT
బన్నీ రిస్క్ చేస్తున్నాడేమో!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో రూపొందుతున్న మూవీ టైటిల్ రేపు రివీల్ చేయబోతున్నారు. ఇప్పటికే 'అల వైకుంఠపురంలో' అని ఫిక్స్ చేసినట్టుగా లీక్స్ ఊపందుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం ఈ వార్త హై లైట్ అయిపోయింది. నిప్పు లేనిదే పొగరాదు అనే తరహాలో ఆల్మోస్ట్ ఇదే ఖరారు అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. నేను నాన్న - అలకనంద అనే మరో రెండు టైటిల్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి కానీ ఇప్పుడీ వైకుంఠపురమే ఎక్కువ చక్కర్లు కొడుతోంది.

కానీ బన్నీ ఫ్యాన్స్ నుంచి దీని గురించి ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదని సోషల్ మీడియా ట్రెండ్స్ ని గమనిస్తే అర్థమవుతుంది. నా పేరు సూర్య తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో చేస్తున్న మూవీ కాబట్టి దీని మీద అంచనాలు మాములుగా లేవు. అందుకే టైటిల్ మొదలుకుని కథ దాకా అన్ని పవర్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడీ అల వైకుంఠపురంలో అనే సాఫ్ట్ టైటిల్ వైపు మొగ్గు చూపడం చూస్తే ఇది ఎంతవరకు మాస్ కు కనెక్ట్ అవుతుందనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు.

ఈ క్రమంలో బన్నీ ఒకరకంగా రిస్క్ చేస్తున్నట్టే లెక్క. అసలే సాఫ్ట్ ఫ్యామిలీ స్టోరీ తరహాలో మేకింగ్ కనిపిస్తోంది. మరోసారి త్రివిక్రమ్ అత్తారింటికి దారేది-సన్ అఫ్ సత్యమూర్తి ఫార్ములానే నమ్ముకున్నట్టు ఉంది. అప్పుడంటే వాటిని ఫ్రెష్ గా ఫీలయ్యారు కాబట్టి సూపర్ హిట్ చేశారు.కానీ ఇప్పుడది పాతదైపోయింది. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ వైకుంఠపురం అంటే కథ ప్రకారం టబు ఉండే ఇంటి పేరట. అందుకే అలా పెట్టారని తెలిసింది. ఇమేజ్ కు మార్కెట్ లెక్కలకు దూరంగా బన్నీ చేస్తున్న ఈ టైటిల్ ఎక్స్ పరిమెంట్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.