బడా నిర్మాత కోరిక బాలయ్య తీరుస్తాడా..??

Tue Feb 23 2021 19:00:01 GMT+0530 (IST)

Will Balayya fulfill the wish of star producer

సినీ ఇండస్ట్రీలో నిర్మాతల పాత్ర ఎంత ఉంటుందో అందరికి తెలిసిందే. నిర్మాత తర్వాతే అందరికి క్రెడిట్ లభిస్తుంది. అయితే గొప్పగొప్ప నిర్మించిన నిర్మాతలకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఓ నిర్మాత కావచ్చు లేదా దర్శకుడు కావచ్చు.. ఎంత డబ్బు ఉన్నా అనుకున్న సినిమాలు తీయలేక పోయాననే బాధ అందరిలోనూ ఉంటుంది. అది బడా ప్రొడ్యూసర్ అయినా అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ అయినా బయటికి చెప్పకపోవచ్చు కానీ ఏదొక రోజు బయటపెట్టక తప్పదు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి దాదాసాహెబ్ అవార్డు అందుకున్న గొప్ప నిర్మాత డి.రామానాయుడు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. అలాగే ఇండియాలోని అన్ని భాషలలో సినిమాలు నిర్మించి ఆయన కోరిక నెరవేర్చుకున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ ప్రొడ్యూసర్ గా పాపులర్ అయ్యాడు దిల్ రాజు.

ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు సినిమాలను నిర్మిస్తుంటాడు. అలాగే మొదటి నుండి ఫ్యామిలీ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఇప్పుడు టాలీవుడ్ లో బడా నిర్మాతగా కొనసాగుతున్నాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో దిల్ రాజు సినిమాలు నిర్మించాడట. కానీ ఇప్పటికి ఆయనకు తీరని కోరిక ఏంటంటే.. ఓ బడా హీరోతో ఒక్కసినిమా కూడా చేయకపోవడమే.

 అవును టాలీవుడ్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు.. నటసింహం నందమూరి బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయలేదు. బాలయ్యతో సినిమా చేయడమే ఆయన చిరకాల కోరిక అంటూ మనసులో మాట బయటపెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం బాలకృష్ణ అక్కినేని అఖిల్ లతో దిల్ రాజు సినిమాలు చేయలేదట. అయితే ప్రస్తుతం అఖిల్ రెండు సినిమాలతో బిజీగా ఉండటంతో బాలయ్యతో నెక్స్ట్ సినిమా చేయాలనే తపనతో ఉన్నాడట. బాలయ్య - అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి దిల్ రాజు కోరిక ఎప్పుడు ఫుల్ ఫిల్ అవుతుందో!