అనుష్క ఆ ముచ్చట తీరుస్తుందా?

Mon May 10 2021 16:00:01 GMT+0530 (IST)

Will Anushka step into the digital platform

నిజానికి.. మన దగ్గర డిజిటల్ విప్లవం వేగం పుంజుకోవడానికి ఇంకో దశాబ్దంపైనే పట్టాల్సింది. కానీ.. కొవిడ్ నేపథ్యంలో అనివార్యంగా డిజిటల్ సినిమా ముందుకు వచ్చింది. బొమ్మ ప్రదర్శించడానికి థియేటర్లు లేకపోవడంతో మూవీ మేకర్స్.. వినోదం కరువైపోవడంతో ఆడియన్స్.. ఓటీటీ వైపు చూశారు. దీంతో.. డిజిటల్ ప్రొజెక్టర్ సక్సెస్ అయిపోయింది. దీంతో.. ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. ఓ వైపు సినిమాలు ప్రదర్శిస్తూనే.. వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాయి ఓటీటీలు!దీంతో.. కొత్త రంగంపై పలువురు సినీ నటులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు దూసుకెళ్తున్నారు కూడా. తెలుగులో టాప్ స్టార్లుగా వెలిగిన తమన్నా కాజల్ సమంత త్రిష నయనతార వంటి వారు వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టారు. అయితే.. స్వీటీ మాత్రమే ఇంకా ఈ వైపు చూడలేదు.

అనుష్క నుంచి వచ్చిన లాస్ట్ మూవీ నిశ్శబ్దం. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ కొత్త సినిమా రాలేదు. తోటి స్టార్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకెళ్తున్నా.. తాను మాత్రం ఇంకా రాలేదు. టాలీవుడ్‌లో కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. ఆమె ఫ్యాన్ బేస్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. ఎన్నో హిట్ చిత్రాలిచ్చిన జేజమ్మకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

మరి వారిని అలరించడానికి ఎప్పుడు స్క్రీన్ పై కనిపిస్తుందో అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతం తెలుగులో రిలీజ్ కావాల్సిన అనుష్క ప్రాజెక్టులు ఏవీ లేవు. నవీన్ పొలిశెట్టితో యువి క్రియేషన్స్ సినిమా అంటున్నారు. ఆ ప్రాజెక్టు ఓకే అయితే.. షూటింగ్ పూర్తయి రిలీజ్ అయ్యేనాటికి సంవత్సరం పడుతుంది. ఈ లోగా డిజిటల్ ప్లాట్ ఫాంలోకి అడుగుపెడుతుందేమో చూడాలి. ఆ ముహూర్తం ఎప్పుడో చూడాలి.