అలియా రెడీమేడ్ స్టోర్ వర్కౌట్ అవుతుందా?

Sat Oct 01 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Will Alia ready made store be a workout

ఇటీవలి కాలంలో  స్టార్ హీరోయిన్లు గర్భాన్ని కూడా ప్రచార పరంగా వినియోగిస్తున్నారు. బేబి బంప్ ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా సర్ ప్రైజ్ చేసి తమదైన స్ర్టాటజీతో కాసులు వెనకేస్తున్నారు.  శిల్పాశెట్టి వంటివారు గర్భధారణకు సంబంధించిన విషయాలను వివరించడానికి ఏకంగా ఛానెల్నే  ప్రారంభించింది. కరీనా కపూర్ ప్రసూతి ఫోటోషూట్‌లను విక్రయించి బాగానే ఆర్జించింది.ఆ ఫోటో కలెక్షన్స్  లో తనదైన చాకచక్యతని ప్రదర్శించింది. ఇంకా కాజల్ అగర్వాల్ బేబి ప్రోడక్ట్ ల్ని ఎండార్స్ చేసి కోట్లు వెనకేసింది. తొమ్మిది నెలల కాలంలో సినిమాలు చేయకపోయినా? డబ్బు ఎలా సంపాదించాలన్నది వాళ్లని చూసే నేర్చుకోవాలి అన్నంత వినూత్నమార్గంలో సంపాదించారు. తాజాగా అలియాభట్ కూడా అదే స్ర్టాటజీతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.


అలియా కూడా  ప్రసూతి దుస్తుల స్టోర్ ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. `నేను ఇప్పటికే ఉన్న నా వార్డ్‌రోబ్‌లో ఖాళీని పూరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది మొత్తం ప్రసూతి సేకరణకు దారితీసింది. మీకు స్నీక్-పీక్ ఇవ్వడానికి నేను వేచి ఉండలేను` అని అలియా  తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. ఈ దుస్తుల లైన్‌తో ముందుకు రావడానికి తనను ప్రేరేపించిన వివిధ కారణాలను  రివీల్ చేసింది.

ఇంతకుముందే  అలియా పిల్లల దుస్తుల శ్రేణిని ప్రారంభించింది. ఇప్పుడు ఆమె మెటర్నిటీ లైన్‌తో  ముందుకు రాబోతుంది.  తాజా సన్నివేశాన్ని బట్టి  అలియా అతి త్వరలో తనను తాను  పూర్తి స్థాయిలో ఫ్యాషన్ వ్యాపారవేత్తగా మార్చుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్బంగా బిపాసా బస్సు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `ఇది చాలా అవసరం. అన్ని సమయాలలో సౌకర్యవంతమైన దుస్తులు మరియు సరిపోయే దుస్తులను కనుగొనడానికి నేను ఎంత  కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు.

గర్భం దాల్చిన సమయంలో ఇలాంటి రెడీమెడీ వేర్స్ ఎంతైనా అవసరం అని రాసుకొచ్చింది. మొత్తానికి అలియా ప్రారంభానికి ముందే  సెలబ్రిటీ కస్టమర్లను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.  ఇప్పటికే అలియా యువతలో  ఫ్యాషన్ ఐకాన్‌గా వెలిగిపోతుంది. అమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గంగూబాయి కతియావాడితో ఆమె రేంజ్ రెట్టింపు అయింది.

గతంలో సమంత  సహా చాలా మంది హీరోయిన్లు బట్టల వ్యాపారాలు ప్రారంభించినా విజయం అంతంత మాత్రమే. కాజల్ అగర్వాల్ .. తమన్నా వంటి వారు నగల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కానీ వాటిని సక్సెస్ చేయడంలో  వెనుకబడ్డారు . మరి అలియా ఎలాంటి స్ర్టాటజీతో వ్యాపారాన్ని సక్సెస్ దిశగా తీసుకెళ్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.