రష్మిక అందుకే దూరంగా వుంటోందా?

Tue Jan 24 2023 12:37:42 GMT+0530 (India Standard Time)

Why Rashmika Mandanna Away From Media

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కన్నడ సోయగం రష్మిక మందన్న. 'ఛలో' మూవీతో తెలుగులో పాగా వేసిన రష్మిక తొలి మూవీ సక్సెస్ తో క్రేజీ హీరోయిన్ అనిపించుకుని అదే ఫామ్ ని కొనసాగిస్తూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. గత ఏడాది 2021లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంది. ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ  'పుష్ప'కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'పుష్ప 2'లో నటిస్తున్న రష్మిక మందన్న రీసెంట్ గా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'వారీసు' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో 'వారసుడు'గా విడుదలైన ఈ మూవీ తమిళంలో జనవరి 11న విడుదల కాగా తెలుగులో మాత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో ఈ మూవీకి విజయ్ జోరుగా ప్రచారం చేశాడు.

అంతే కాకుండా దర్శకుడు వంశీ పైడిపల్లి రష్మిక మందన్న కూడా అక్కడి తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి విజయ్ పెద్దగా పనట్టించుకోలేదు. రష్మిక అయినా మీడియా ముందుకు వచ్చి 'వారసుడు' కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. రష్మిక కూడా విజయ్ తరహాలోనే తెలుగు మీడియాకు ముఖం చాటేసింది. దీంతో రష్మికపై పలు రకాల ఊహాగానాలు వినిపించడం మొదలైంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక ముఖం చాటేయడంతో దీనిక బలమైన కారణమే వుందనే వాదన వినిపిస్తోంది. గత కొంత కాలంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక జాలీ ట్రిప్ లు వేస్తోందని ఇద్దరు కలిసే మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారని ప్రచారం జరిగింది. ఈ విషయాలపై తెలుగు మీడియా ప్రశ్నిస్తుందనే రష్మిక ముఖం చాటేసిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే రష్మిక నటించిన బాలీవుడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ గా నిలుస్తుండటంతో తన దృష్టి మొత్తం సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న 'యానిమల్' మూవీలో నటిస్తోంది. రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా ఏ రేంజ్ లో ఎంత వైల్డ్ గా వుండనుందో క్లారిటీ ఇచ్చేసింది.

అంతే కాకుండా రణ్ బీర్ కపూర్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఆగస్టు 11న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.