విజయ్ - రష్మిక: ఏం జరుగుతోంది..ఏం జరుగుతోంది?

Tue Jun 25 2019 22:16:20 GMT+0530 (IST)

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.  'గీత గోవిందం' లో గీత మేడమ్.. గోవిందం సారు ప్రేక్షకులను పూర్తిగా తమ కెమిస్ట్రీతో క్లీన్ బౌల్డ్ చేశారు.  అయితే అదేంటో గానీ అప్పటినుంచే ఇద్దరిమధ్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఉందని.. వారిద్దరి మధ్య ప్రేమ వల్లే రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం రద్దయిందని జోరుగా రూమర్లు హల్చల్ చేశాయి.అయితే  ఆ విషయం ఇప్పటివరకూ నిర్థారణ కాలేదు.  అయితే తాజాగా మరోసారి రౌడీ స్టార్.. రష్మిక మధ్య ఫ్రెండ్షిప్ హాట్ టాపిక్ గా మారింది.  నిన్న విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ తదితరులు ఎఎంబీ సినిమాస్ లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమా చూడడం.. తర్వాత ప్రెస్ మీట్ కు హాజరవడం తెలిసిందే.  అయితే ఈ సినిమాకు రష్మిక కూడా వచ్చిందని.. అయితే ఫోటోలలో మాత్రం లేదని సమాచారం.  ప్రెస్ మీట్ తర్వాత విజయ్ ఫ్రెండ్స్ గ్యాంగుతో కలిసి జూబ్లీ హిల్స్ లోని ఒక హోటల్ కు వెళ్లి.. అక్కడ ఫుల్ గా చిల్ అవుట్ అయ్యారట.  

ఈ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఇందులో రష్మిక కళ్ళజోడు ధరించి ఉండడం విశేషం.  సినిమా ఫంక్షన్లు.. ఇతర ఈవెంట్లకు రష్మిక కాంటాక్ట్ లెన్సులు పెట్టుకొని వస్తుంది.  కానీ ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా ఉన్నప్పుడు కళ్ళజోడు ధరిస్తుంది. విజయ్ - రష్మిక ఫ్రెండ్షిప్ చూసినవారు ఇది జస్ట్ ఫ్రెండ్ షిప్ అయి ఉండకపోవచ్చని.. ఫ్రెండ్ షిప్ కంటే రెండాకులు ఎక్కువే ఉందని అంటున్నారట.  మరి ఇవి జస్ట్ ఊహాగానాలేనా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.