Begin typing your search above and press return to search.

'ఒక్క అడుగు' ప‌డేది ఇంకెప్పుడు?

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:22 AM GMT
ఒక్క అడుగు ప‌డేది ఇంకెప్పుడు?
X
అబ్బాయ్ ని డైరెక్ట్ చేయాల‌న్న‌ది పెద‌నాన్న ఆలోచ‌న‌. కానీ ఏదీ ఆ ఒక్క అడుగు ప‌డ‌దేం? ఇలా ఇంకెన్నాళ్లు? గ‌త కొంత‌కాలంగా దీనికి స‌బంధించిన ఎలాంటి స‌మాచారం లేదేమిటో! ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ బ్యాన‌ర్ లో సోలోగా ఓ సినిమా తీయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. `ఒక్క అడుగు` అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు. బాహుబ‌లి ప్రారంభానికి ముందే ఒక్క అడుగు ప్రారంభ‌మ‌వుతుంద‌ని అన్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టాలెక్కిందే లేదు. ప్ర‌భాస్ వేరే వేరే సినిమాల‌కు కాల్షీట్లు కేటాయిస్తున్నాడు త‌ప్ప‌! `ఒక్క అడుగు` పై దృష్టి సారించ‌లేద‌ని త‌ర్వాత ప‌రిణామాలే చెప్పాయి. మూడేళ్ల క్రితం బ‌ర్త్ డే సంద‌ర్భం గా ఈ సినిమా గురించి పెద్దాయ‌న కృష్ణంరాజు స్వ‌యం గా డీటెయిల్స్ వెల్ల‌డించారు.

ప్ర‌భాస్ క‌టౌట్ కు అదిరి పోయే స్క్రిప్ట్ రెడీ అయ్యింద‌ని... చ‌క్క‌ని సామాజిక‌ సందేశంతో కూడుకున్న సినిమా అవుతుంద‌ని... `ఒక్క అడుగు` తో వేయి అడుగుల ప‌డేలా ఇన్ స్పైర్ చేసే క‌థాంశం కుదిరింద‌ని చెప్పారు. కృష్ణం రాజు స్వ‌యంగా ఈ క‌థ‌ను సిద్దం చేసుకున్నట్లు వెల్ల‌డించారు. ఆ సంద‌ర్భంలో మీరే డైరెక్ట్ చేయోచ్చు క‌దా? అని ప్ర‌శ్నించ‌గా తాను ఆస‌క్తిగానే ఉన్నాన‌ని తెలిపారు. అయితే అది నేను చేయాల‌నే రూలేం లేదు. నేను నిర్మిస్తాను. పూరి జ‌గ‌న్నాథ్ చేసినా తన‌కు ఓకే అని కూడా అన్నారు. ప్ర‌భాస్ కి వీలు చిక్క‌గానే సెట్స్ కు వెళ‌తామ‌ని చెప్పారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చ‌లేదు.

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ సాహో చేసాడు. ఇప్పుడు జాన్ లో న‌టిస్తున్నాడు గానీ! పెద‌నాన్న డ్రీమ్ ప్రాజెక్టు ను మాత్రం ప‌ట్టాలెక్కించలేక‌పోయాడు. మ‌రి జాన్ త‌ర్వాత అయినా ఒక్క అడుగు గురించి డార్లింగ్ ఆలోచిస్తాడేమో చూడాలి. నిజంగానే ఒక్క అడుగు గ‌నుక ప‌డితే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందేమో.