Begin typing your search above and press return to search.

అతి జాగ్ర‌త్త టాలెంటెడ్ హీరో కొంప ముంచుతుందేమో...!

By:  Tupaki Desk   |   19 Oct 2020 8:50 AM GMT
అతి జాగ్ర‌త్త టాలెంటెడ్ హీరో కొంప ముంచుతుందేమో...!
X
యువ హీరో నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గుర్తింపు కోసం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కున్న నవీన్.. సినిమా అవకాశాల కోసం 15 వందలకు పైగా ఆడిషన్స్ కు హాజరయ్యాడట. థియేటర్ ఆర్టిస్టుగా విజయ్ దేవరకొండతో కలిసి తొలినాళ్లలో కష్టపడిన నవీన్.. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' 'ఢీ ఫర్ దోపిడి' '1 నేనొక్కడినే' వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ఈ క్రమంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. 'ఏజెంట్..' సినిమా సెట్స్ మీద ఉండగానే.. నవీన్ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. 'దంగల్' దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన 'చిచ్చోరే' సినిమాలో నవీన్ కీలక పాత్రలో నటించాడు. సినిమాల ఎంపికలో స్లో అండ్ స్టడీగా వెళ్తున్న నవీన్ అతి జాగ్ర‌త్త అతనికి ఇబ్బందులు తెస్తుందేమో అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వల్ల అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే నవీన్ మాత్రం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. తెలుగులో 'మహానటి' మేకర్స్ నిర్మిస్తున్న 'జాతిరత్నాలు' అనే కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ కంప్లీట్ చేశాడు నవీన్. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీని తర్వాత ఇంత వ‌ర‌కు మరో సినిమా ఒప్పుకోలేదు. ఇండ‌స్ట్రీ జ‌నాల సంగతి అటుంచితే.. 'ఏజెంట్..' సినిమాతో ఆడియెన్స్ మెప్పుపొందిన నవీన్.. వాళ్ళు మ‌రిచిపోయేలోపు తాను చేస్తున్న కొత్త సినిమాల అప్డేట్ ఇస్తే బాగుటుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలాఉండగా కొరటాల శివ నిర్మించే ఓ వెబ్ సిరీస్ లో నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్ పోషిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వెబ్ సిరీస్ కోసం స్టోరీ కూడా రెడీ చేసిన కొరటాల.. తన శిష్యుడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాడని అనుకుంటున్నారు. నవీన్ కనీసం దీనికి సంబంధించిన అప్డేట్ అయినా ఇస్తే మంచిదని సినీ జనాలు సూచిస్తున్నారు.