Begin typing your search above and press return to search.

అసలు బజ్ లేని సినిమా.. హీరో హిట్టు కొడతాడా..??

By:  Tupaki Desk   |   7 March 2021 12:30 AM GMT
అసలు బజ్ లేని సినిమా.. హీరో హిట్టు కొడతాడా..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలంగా హిట్టుకోసం తహతహలాడుతున్న హీరోలలో ఒకరు శర్వానంద్. 2017లో శతమానం భవతి, మహానుభావుడు లాంటి డీసెంట్ హిట్స్ తర్వాత మళ్లీ అలాంటి హిట్ ఈ హీరో ఖాతాలో పడలేదు. పడిపడిలేచే మనసు చాలా అంచనాలతో విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అలాగే రణరంగం, జానూ సినిమాలు కూడా అదేబాటలో ప్లాప్ అయ్యాయి. కానీ పడిపడిలేచే మనసుకంటే కూడా ఘోరంగా విఫలమయ్యాయి రణరంగం, జానూ సినిమాలు. ప్రస్తుతం మళ్లీ శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు శర్వానంద్. కానీ ఎందుకో ఈ సినిమాపట్ల అంత ఉత్సాహంగా లేడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే మహేష్ బాబు చేతులమీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు శ్రీకారం మేకర్స్. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తే కొత్తగా ఏమి కనిపించలేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇదివరకే శర్వా ఇలాంటి అంశాలను తన పాత సినిమాలలో టచ్ చేసేసాడు. ఆల్రెడీ శతమానం భవతిలో వ్యవసాయం టాపిక్ ప్రస్తావించాడు. ఇప్పుడేమో ఫుల్ లెన్త్ వ్యవసాయం పై సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మహర్షి సినిమాలో వ్యవసాయం గురించి అన్నివిధాలా చర్చించడం జరిగింది. మళ్లీ అదేతరహా కాన్సెప్ట్ అంటే కష్టమని అంటున్నారు నిపుణులు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి సినిమా తీసి హిట్టు కొట్టాడు నితిన్. మార్చ్ 11న శ్రీకారం సినిమా రిలీజ్ అవుతోంది. కానీ సినిమాకు సంబంధించిన బజ్ ఎక్కడా కనిపించడం లేదు. మరి అసలే శ్రీకారంతో పాటు చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. చూడాలి మరి శర్వానంద్ అన్ని సినిమాలను పక్కకునెట్టి హిట్టు కొడతాడేమో!