'లవ్ స్టోరీ' గురించి చెప్పట్లేదేంటి చైతూ ?

Fri Dec 13 2019 07:00:01 GMT+0530 (IST)

ఇప్పుడొస్తున్న సినిమాలకు టైటిల్ పెట్టకముందే మీడియా ద్వారా ఆడియన్స్ కు తెలిసిపోతుంది.  అయితే తాజాగా నాగ చైతన్య సినిమాకు సంబంధించి  'లవ్ స్టోరీ' అనే టైటిల్ పెట్టారని తుపాకి ఎక్స్ క్లూజీవ్ గా అందించింది. ఆ తర్వాత ఈ టైటిల్ అందరికీ రీచ్ అయిపొయింది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి చైతూ దగ్గర ప్రస్తావన తెస్తే ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ అని చెప్పుకొచ్చాడు.అయితే సినిమాకు టైటిల్ ఇదే ఫిక్స్ కాకపోతే జనవరిలో ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అందుకే చైతూ కూడా టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. జనవరిలో 'లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ ఉంటుందనే టాక్ ఉంది. సో అదే రోజు అఫీషియల్ ప్రకటించే అవకాశం ఉంది.+