Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ని ఎందుకు నిషేధించాలంటే?

By:  Tupaki Desk   |   15 May 2022 5:30 AM GMT
బాలీవుడ్ ని ఎందుకు నిషేధించాలంటే?
X
బాలీవుడ్ ను బ‌హిష్క‌రించాలి. గ‌త కొన్నేళ్లుగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. ఇది ఇప్ప‌టికీ నివురుగ‌ప్పిన నిప్పులా ర‌గులుతోంది. #బాయ్ కాట్ బాలీవుడ్ హ్యాష్ టాక్ ఇప్ప‌టికీ వైర‌ల్ గా మారుతోంది. రంగుల మాయా ప్ర‌పంచం చుట్టూ పొగ క‌మ్మిన‌ నిప్పులా ఇది ద‌హించేస్తూనే ఉంది.

దీనికి కార‌ణాలేమిటీ? అన్న‌ది ఆరా తీస్తే అది ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది. దీనికి నెటిజ‌నులు ఎవ‌రికి వారు త‌మ కోణంలో సామాజిక మాధ్య‌మాల్లో విశ్లేష‌ణ‌ల్ని జోడిస్తున్నారు. కొంద‌రు బాలీవుడ్ ని మాఫియాతో పోలిస్తే మ‌రికొంద‌రు డ్ర‌గ్స్ ని పెంచి పోషిస్తున్న‌ది బాలీవుడ్ అని విశ్లేషించారు. ఇంకొంద‌రు న‌ట‌వార‌స‌త్వాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బాలీవుడ్ ఇన్ సైడ‌ర్స్ ఔట్ సైడర్స్‌.. యూత్ చెడిపోవ‌డం వ‌గైరా అంశాల‌ను కూడా ప్ర‌స్తావించారు.

ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారులు బాలీవుడ్ ను బహిష్కరించాలని డిమాండ్ చేయడం ప్రారంభించ‌డం వెన‌క చాలా కార‌ణాలు ఉన్నాయి. ఈ విషయంలో నెటిజన్లు ట్విట్టర్ లో బాయ్ కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించారు. బాలీవుడ్ ను బహిష్కరించడం ఎందుకు ట్రెండింగ్ లో ఉంది? అంటే.. ఇప్ప‌టికిప్పుడు లేటెస్ట్ రీజ‌న్ వేరేగా ఉంది. సౌత్ సినిమా బాలీవుడ్ ని మించి ఎదిగేస్తోంది. ఇటీవ‌లి కాలంలో ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యాల త‌ర్వాత బాలీవుడ్ పూర్తిగా డిఫెన్స్ లో ప‌డిపోయింది. సౌత్ సినిమాల డామినేష‌న్ ని బాలీవుడ్ త‌ట్టుకోలేకపోతోంది. సౌత్ హీరోల పోటీత‌త్వం అక్క‌డి వారికి డైజెస్ట్ కావ‌డం లేద‌న్న విమ‌ర్శ తీవ్ర‌త‌ర‌మైంది.

దీనిపై ట్విట్ట‌ర్ లో బోలెడంత చ‌ర్చ సాగుతోంది. హిందీ హీరోలు పాన్ మ‌సాలా హీరోలైతే.. సౌత్ హీరోలు పాన్ ఇండియా హీరోలు అంటూ కీర్తించ‌డం మ‌రో లెవ‌ల్లో ఉంది. దీనిని కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ ని బ‌హిష్క‌రించాల‌న్న డిమాండ్ ఊపందుకుంది.

ఇక బాలీవుడ్ మాఫియాని ఎదురించే వాళ్లు అక్క‌డే పుట్టుకొచ్చారు. ఆ ప‌రిశ్ర‌మ‌కి క్వీన్ కంగ‌న ఒక ప్ర‌ధాన‌ శ‌త్రువు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిందీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌రికాన్ని ఏనాడో నిల‌దీసారు. నెపోటిజాన్ని వ్య‌తిరేకిస్తూ మాఫియాని త‌రిమి కొట్టేందుకు పిలుపునిచ్చారు. ఇక సాటి నాయిక‌ల‌పై కౌంట‌ర్ల‌తోనూ కంగ‌న త‌న‌దైన జ‌వాబిస్తున్నారు. ఇంత‌కుముందు గెహ్ర‌యాన్ విడుద‌లైన‌ప్పుడు దీపికపైనా అలాంటి కామెంట్లు చేసింది. ఒక పోస్ట్ ను షేర్ చేయడం ద్వారా గెహ్రైయాన్ వైపు పరోక్షంగా మొగ్గు చూపిన కంగ‌న‌.. “నేను కూడా మిలీనియల్ ని,.. అయితే నేను ఈ రకమైన శృంగారాన్ని గుర్తించి అర్థం చేసుకుంటాను…మిలీనియల్/న్యూ ఏజ్/ సినిమాల తరపున. పట్టణ ప్రాంత అమ్మాయిలు చెత్తను అమ్ముకోవద్దు...చెడ్డ సినిమాలు తీయొద్దు.. స్కిన్ షో లేదా అడల్ట్ ఫిలిం ఎన్ని ఉన్నా మిమ్మల్ని రక్షించలేవు...ఇది ప్రాథమిక వాస్తవం కోయి గెహ్రైయాన్ వాలీ బాత్ నహీ హై.. అంటూ కంగ‌న విమ‌ర్శించింది.

ఇంత‌కుముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంలోనూ బాలీవుడ్ ని నిషేధించాల‌న్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఇటీవ‌ల దీపిక గెహ్రైయాన్ చిత్రం పరాజయం పాలవడంతో సుశాంత్ అభిమానులు సంబరాలు చేసుకోవ‌డం వెన‌క కార‌ణాలున్నాయి. దీపిక భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల‌నే బాలీవుడ్ ఔట్ సైడ‌ర్ అయిన‌ సుశాంత్ సింగ్ అవ‌కాశాలు కోల్పోయాడ‌ని కూడా టాక్ వినిపించింది. అందుకే సుశాంత్ మరణానంతరం ఆయన అభిమానులు బాలీవుడ్‌ను వ్యతిరేకిస్తున్నారు. మరోసారి ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. గెహ్ర‌యాన్ పై సుశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించ‌గా.. దివంగత నటుడి అభిమానులు ఇప్పటికే సినిమా ఫ్లాప్ అని ప్రకటించారు.

ఇటీవ‌ల వైర‌ల్ అయిన కొన్ని హ్యాష్ ట్యాగ్ ల్ని ప‌రిశీలిస్తే బాలీవుడ్ పై వ్య‌తిరేక‌త అర్థ‌మ‌వుతుంది..

వాటిలో కొన్ని..

#బాలీవుడ్ మాఫియాని నిషేధించాలి..!

#బాలీవుడ్ చెత్త సినిమాలు చూడ‌కూడ‌దు!

#Gehraiyaan ఫ్లాప్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ అభినందనలు

#Gehraiyaanని బహిష్కరించు https://t.co/PdpR32C7fj

బాలీవుడ్ ను బహిష్కరించడం యువతను కాపాడుతుంది

బాలీవుడ్ కి అండర్ వరల్డ్ సంబంధాలు ఉన్నాయి ఇది నిజం

భారతదేశంలో పాతాళానికి ఒక ముఖం ఉంటే అది బాలీవుడ్..

# ఔట్ సైడ‌ర్స్ ని కిల్ చేసే ప‌రిశ్ర‌మ బాలీవుడ్
# మ‌గువ‌ల‌కు ర‌క్ష‌ణ లేని ప‌రిశ్ర‌మ బాలీవుడ్..
# బాలీవుడ్ పై సౌత్ డామినేష‌న్
# సౌత్ ని చూసి బాలీవుడ్ నేర్వాలి.. ఎద‌గాలి!